15 రోజుల క్రితం పెళ్లి.. ఫ్లాట్ కొనడానికి వెళ్లి..

Published : Jul 03, 2020, 02:36 PM IST
15 రోజుల క్రితం పెళ్లి.. ఫ్లాట్ కొనడానికి వెళ్లి..

సారాంశం

మిత్రులతో వెళ్లాడు. తిరిగి వస్తుండగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామ సమీపంలోని వంతెనను కారు ఢీకొట్టింది.  

అతనికి 15 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. ఈ ఆనందంలోనే భార్యకు ఫ్లాట్ గిఫ్ట్ గా ఇందామని అనుకున్నాడు. ఈ పనిమీద స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో.. నవ వరుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డికి చెందిన గంట భాస్కర్‌(28)కు 15 రోజుల క్రితం వివాహమైంది. మంచిర్యాలకు ప్లాట్‌ విషయంలో కారులో బుధవారం మిత్రులతో వెళ్లాడు. తిరిగి వస్తుండగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామ సమీపంలోని వంతెనను కారు ఢీకొట్టింది.

కారును అతివేగంగా నడపడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న నగేష్‌, అవంత్‌లాడే, చందు, గంట  భాస్క ర్‌, డ్రైవర్‌ కృష్ణను అంబులెన్స్‌లో లక్ష్మారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలి స్తుండగా గంట భాస్కర్‌ మృతి చెందాడు. కారు పల్టీలు కొట్టే సమయంలో బోలే రో వాహనానికి తగలడంతో డ్రైవర్‌ మల్లేష్‌కు గాయాలయ్యాయి. 

కాగా.. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వారి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. దీంతో.. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా.. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌