ప్రగతి భవన్ ను తాకిన కరోనా వైరస్: ఫామ్ హౌస్ కు మారిన కేసీఆర్

By telugu teamFirst Published Jul 3, 2020, 2:59 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను కూడా కరోనా వైరస్ తాకినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో కేసీఆర్ గజ్వెల్ లోని తన ఫామ్ హౌస్ కే పరిమితమైనట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసం ప్రగతిభవన్ లో పనిచేసే ఐదుగురికి కరోనావైరస్ సోకింది. దాంతో ప్రభుత్వ వర్గాల్లో కలకలం చోటు చేసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. 

ఐదుగురు ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి కెసీఆర్ గజ్వెల్ లోని తన నివాసగృగహంలో ఉంటున్నారు. అయితే, ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా సోకిన విషయంపై ప్రభుత్వం ఏ విధమైన అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఈ విషయంపై మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గత వారం రోజుల్లో దాదాపు గా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణ లో ప్రగతి భవన్‌ ను శానిటైజేషన్ చేస్తున్నారు. 

జీహెచ్‌ఎంసీ పరిధి లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్‌ పరిధి లో లాక్‌ డౌన్ విధించాలని ప్రభుత్వం భావించింది. కానీ కరోనా కట్టడి కి కేవలం లాక్‌ డౌనే పరిష్కారం కాదని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

click me!