ఎమ్మెల్యేల కొనుగోలుపై సీబీఐ విచారణను సవాల్ చేసిన కేసీఆర్ సర్కార్: ఈ నెల 6న హైకోర్టు తీర్పు

By narsimha lode  |  First Published Feb 3, 2023, 7:04 PM IST

ఎమ్మెల్యేల  కొనుగోలును సీబీఐ విచారణకు ఆదేశిస్తూ  తెలంగాణ హైకోర్టు  సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం  డివిజన్ బెంచ్ లో సవాల్  చేసింది.  ఈ నెల  6న తెలంగాణ హైకో్ర్టు డివిజన్ బెంచ్  తీర్పును వెల్లడించనుంది.


హైదరాబాద్: ఎమ్మెల్యేల  కొనుగోలును సీబీఐ విచారణకు  ఆదేశిస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్  చేస్తూ   తెలంగాణ ప్రభుత్వం దాఖలు  చేసిన పిటిషన్ పై   ఈ నెల  6వ తేదీన  తెలంగాణ  హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును  ఇవ్వనుంది.

 మొయినాబాద్ ఫాం హౌస్ లో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును  సీబీఐకి అప్పగిస్తూ  2022 డిసెంబర్  26వ తేదీన  తెలంగాణ హైకోర్టు  సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.  సిట్  విచారణ  పారదర్శకంగా  లేదని  సీబీఐ విచారణకు  ఆదేశాలు జారీ చేసింది  తెలంగాణ హైకోర్టు .  ఈ కేసును సీబీఐ విచారణకు  అప్పగిస్తూ   హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను  తెలంగాణ ప్రభుత్వం.  ఈ ఏడాది జనవరి  4వ తేదీన   సవాల్  చేసింది. ఈ  పిటిషన్ పై  అన్ని వర్గాల వాదనలను  హైకోర్టు వింది. జనవరి  30వ తేదీ లోపుగా  రాతపూర్వకంగా వాదనలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.   సిట్  కూడా  రాతపూర్వకంగా  వాదనలను సమర్పించింది.    అన్నింటిని  పరిశీలించిన తర్వాత  ఈ నెల  6వ తేదీన   తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించనుంది .

Latest Videos

undefined

2022 అక్టోబర్  26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలు పెట్టేందుకు   ముగ్గురు ప్రయత్నించారు.  ఈ విషయమై తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు  చేశారు ఈ ఫిర్యాదు మేరకు  రామచంద్రభారతి,  సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్  చేశారు.  

also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సీబీఐకి అప్పగింత: తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల  ప్రలోభాల వెనుక  బీజేపీ  హస్తం  ఉందని  బీఆర్ఎస్  చీఫ్ కేసీఆర్ ఆరోపించారు.  ఈ విషయమై  మీడియా సమావేశం  ఏర్పాటు  చేసి  ఆడియో, వీడియో సంభాషణలను  కూడా   మీడియాకు అందించారు.    సిట్ విచారణను  బీజేపీ సహ  ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు  వ్యతిరేకించారు.  సీబీఐ విచారణ చేయాలని కోరారు.  ఈ పిటిషన్లపై విచారణ చేసిన సింగిల్ బెంచ్ ధర్మాసనం  సీబీఐ విచారణకు  ఆదేశాలు జారీ చేసింది.   సీబీఐ విచారణను  కేసీఆర్ సర్కార్  సవాల్  చేసింది.  ఈ పిటిషన్ పై  ఈ నెల  6వ తేదీన  తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్  తీర్పును వెల్లడించనుంది.

click me!