అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను కలిసిన కేటీఆర్.. ఈటల, రాజసింగ్ తో సరదా సంభాషణ..

Published : Feb 03, 2023, 05:04 PM IST
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను కలిసిన కేటీఆర్.. ఈటల, రాజసింగ్ తో సరదా సంభాషణ..

సారాంశం

అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలతో వచ్చి సరదాగా మాట్లాడారు. వీరితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా జతకూడారు. 

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు శాసన సభలో పలు కొత్త సన్నివేశాలు కనిపించాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించడానికి కొంత సమయం ముందు బీజేపీ ఎమ్మెల్యేలు అయిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ల వద్దకు మంత్రి కేటీఆర్ వచ్చారు. వారితో సరదాగా సంభాషించారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు చర్చలు జరిగాయి.

9 ఏళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయమై ఊరిస్తున్నారు: కేసీఆర్ ‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హుజరాదాబాద్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పలు అధికారిక కార్యక్రమాలకు ఎందుకు హాజరుకావడం లేదని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ప్రశ్నించారని సమాచారం. అయితే తనను ఎవరూ పిలవడం లేదని ఈటల మంత్రికి జవాబు చెప్పినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పద్దతి సరిగా లేదని ఈటల మంత్రికి చెప్పారని తెలుస్తోంది.

అదానీ కంపెనీ అవకతవకలతో పేదలపై పెనుభారం: బీఆర్ఎస్ ఎంపీ నామా

ఇలా వీరు మాట్లాడుకుంటుండగానే కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అక్కడికి చేరుకున్నారు. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆయన మంత్రికి తెలిపారు. అదే సమయంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కలెక్టర్ నుంచి అయిన పిలుపు ఉండాలని తెలిపారు. వీరి మాటలకు మంత్రి కేటీఆర్ సరదాగా నవ్వారు. 

పెద్ద పెద్ద మాటలు చెప్పి తుస్సుమనిపించారు: గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి సంచలనం

కొంత సమయం తరువాత బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, కేటీఆర్ మధ్య కూడా ఆసక్తికర చర్చ జరిగింది. తనకు కాషాయ రంగు నచ్చదని, అది కళ్లకు గుచ్చుకుంటోందని ఆయన ధరించిన చొక్కాను ఉద్దేశించి మంత్రి అన్నారు. దీనికి రాజా సింగ్ బదులిచ్చారు. భవిష్యత్ లో మీరు కూడా ఇదే రంగు చొక్కా వేసుకోవచ్చేమో అని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా.. మంత్రి కంటే ముందే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వచ్చి కలిశారు. వారిద్దరు కొంత సేపు మాట్లాడుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్