
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో వామన్ రావు దంపతుల హత్య కేసును సుమోటోగా తీసుకొంటామని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ప్రకటించింది.
ఈ నెల 17న వామన్ రావు దంపతుల హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించారు. వామన్ రావు దంపతులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అడ్వకేట్ జేఎసీ నేతలు డిమాండ్ చేశారు.మరోవైపు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ అడ్వకేట్ శ్రవంత్ శంకర్ పిటిషన్ దాఖలు చేశారు.
also read:పెద్దపల్లిలో వామన్ రావు దంపతుల హత్య: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్
ఇదిలా ఉంటే వామన్ రావు దంపతుల హత్యపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది.ఈ కేసును సుమోటోగా తీసుకొంటామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసు విషయమై హైకోర్టు ధర్మాసనం ఏ రకమైన ఆదేశాలు ఇస్తోందోననేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
వామన్ రావుకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినా కూడ పోలీసులు మాత్రం రక్షణ కల్పించలేదని అడ్వకేట్స్ జేఎసీ నేతలు ఆరోపిస్తున్నారు. వామన్ రావు దంపతుల ఘటనను హైకోర్టు సీరియస్ గా తీసుకొంది.