వామన్‌రావు దంపతుల హత్య: విధులు బహిష్కరించిన అడ్వకేట్స్

By narsimha lodeFirst Published Feb 18, 2021, 10:45 AM IST
Highlights

పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల గ్రామం వద్ద రోడ్డుపై వామన్ రావు దంపతులను విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో కోర్టులను బహిష్కరించి న్యాయవాదులు నిరసనకు దిగారు.
 

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల గ్రామం వద్ద రోడ్డుపై వామన్ రావు దంపతులను విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో కోర్టులను బహిష్కరించి న్యాయవాదులు నిరసనకు దిగారు.

రాష్ట్రంలోని పలు కోర్టుల్లో న్యాయవాదులు తమ విదులను బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అడ్వకేట్స్ డిమాండ్ చేశారు. హైకోర్టు  గేట్ 4 నుండి గేట్ 6 వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. 

వామన్ రావు దంపతులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని హైకోర్టును న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలని న్యాయవాద జేఎసీ డిమాండ్ చేస్తోంది..

ఈ నెల 17వ తేదీన వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టుగా సమాచారం. నిందితుల నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 


 

click me!