మా ఆదేశాలు పట్టించుకోరా.... చర్యలు తప్పవు: తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆదేశం

By Siva KodatiFirst Published Jun 8, 2020, 5:23 PM IST
Highlights

కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయని పక్షంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని న్యాయస్థానం హెచ్చరించింది.

కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయని పక్షంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని న్యాయస్థానం హెచ్చరించింది.

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను ఇందుకు బాధ్యుల్ని చేస్తామని  కోర్టు స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలని గతంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది.

Also Read:షూటింగ్‌లు షురూ.. ఓకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. కండిషన్స్‌ అప్లై

ఈ నేపథ్యంలో ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని.. దీనిపై విచారణ జరగాల్సి ఉందని అడ్వొకేట్ జనరల్ ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ  జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని దీనిపై ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు కూడా చేయడం లేదని మండిపడింది. రక్షణ పరికరాలు సరఫరా  చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే మీడియాకు అందించే బులెటిన్లలోనూ తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు  చేపడతామని హెచ్చరించింది.

Also Read:పదో తరగతి పరీక్షల భవితవ్యం తేల్చనున్న కేసీఆర్: కొద్దిసేపట్లో కీలక ప్రకటన

వాస్తవాలు తెలియాలంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.

click me!