#RTC strike: నివేదికలు దాచేస్తారా ... విచారణ వాయిదా వేసిన హైకోర్టు

By Siva KodatiFirst Published Oct 28, 2019, 4:55 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం 2.30కి మరోసారి విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఎల్లుండికి గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా.. హైకోర్టు కుదరదని చెప్పింది. 

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం 2.30కి మరోసారి విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఎల్లుండికి గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా.. హైకోర్టు కుదరదని చెప్పింది.

తెలంగాణ రాష్ట్రంలో రైళ్లలో కంటే బస్సుల్లోనే జనం ఎక్కువగా ప్రయాణం చేస్తారని.. తమకు ఈడీ కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదని ధర్మాసనం ప్రశ్నించింది. 21 డిమాండ్లలో 5 డిమాండ్లు పరిష్కరించలేరా అని నిలదీసింది.

నివేదికలను తమ వద్ద కూడా దాచి పెడతారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమైతే ఏం చర్యలు తీసుకోవాలో చెప్పాలని తెలిపింది. టూల్స్, స్పేర్ పార్ట్స్ ఎందుకు సమర్పించలేదంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుపై న్యాయస్థానం మండిపడింది. 

Also Read:RTC strike: విలీనం పక్కనబెట్టి.. మిగిలిన డిమాండ్లు చూడాలన్న హైకోర్టు

ఆర్టీసీ తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరగాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 ప్రధాన డిమాండ్లపై చర్చిద్దామన్నా వినలేదని.. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటకు వెళ్లిపోయారని ఆయన గుర్తు చేశారు.

దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టి మిగతా వాటిపై చర్చించాలని సూచించింది. చర్చలు జరిగితేనే కార్మికుల్లో ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు తెలిపింది.

ఆర్థిక భారం కాని డిమాండ్లపై చర్చలు జరపాలని సూచించింది. ఒక్క డిమాండ్‌పై పట్టుబట్టకుండా మిగిలిన డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇదే సమయంలో కోర్టు ఆదేశాలను అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని ఆర్టీసీ తరపు న్యాయవాది తెలిపారు.

Also read:RTC Strike:విషాదం...మహిళా ఆర్టీసి కండక్టర్ ఆత్మహత్య

మొత్తం 45 డిమాండ్లలో కార్పోరేషన్‌పై ఆర్ధిక భారం కానీ డిమాండ్ల చర్చ జరగాలన్నామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాత్రికి రాత్రి ఆర్టీసీ విలీనం సాధ్యం కాదు కదా అని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చింది మొత్తం డిమాండ్ల మీద మాత్రమేనన్న ఆర్టీసీ న్యాయవాది...కేవలం డిమాండ్లు అన్న విధంగా అధికారులు ప్రచారం చేశారని తెలిపారు.

విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టి మిగిలిన వాటిపై చర్చ జరగకపోతే ఇలానే ప్రతిష్టంభన కొనసాగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరువర్గాల మధ్య సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరోసారి గుర్తు చేస్తున్నామని న్యాయస్థానం తెలిపింది.

చర్చల వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేసిన ఆర్టీసీ యాజమాన్యం చర్చల సమయంలో అన్ని డిమాండ్లు చర్చించాలని కార్మిక సంఘాలు పట్టుపట్టాయని నివేదికలో తెలిపింది. 

click me!