లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే...

By telugu team  |  First Published Oct 28, 2019, 4:35 PM IST

అక్రమ సంబంధం బయటపడుతుందని తల్లి రజితను చంపిన కూతురు కీర్తి గురించి తండ్రి శ్రీనివాస రెడ్డి స్పందించారు. తన భార్య రజితను చంపిన కీర్తి తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు.


హైదరాబాద్: ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తూ మందలించినందుకు తల్లి రజితను చంపిన పల్లెర్ల కీర్తి ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది. తల్లిని చంపడమే కాకుండా ఆ సంఘటనపై తండ్రిపైనే ఆమె ఫిర్యాదు చేసింది. హైదరాబాదు శివారులోని హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

తన కూతురు కీర్తి విషయంపై తండ్రి శ్రీనివాస రెడ్డి స్పందించారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన కూతురు, భార్య కనిపించలేదని, దాంతో తాను కూతురు కీర్తికి ఫోన్ చేశానని ఆయన తెలిపారు. ఎక్కడున్నావని కీర్తిని అడిగితే తాను వైజాగ్ వెళ్లానని చెప్పిందని, అమ్మ ఎక్కడుందని అడిగితే తెలియదని చెప్పిందని ఆయన అన్నిారు. 

Latest Videos

Also Read: ఇద్దరితో లవ్, శవం పక్కన ప్రియుడితో కలిసి..: తల్లిని చంపిన కీర్తి అరెస్టు

అయితే, కీర్తి చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవడంతో తనకు అనుమానం వచ్చిందని, వైజాగ్ ఎవరితో వెళ్లావని తాను నిలదీశానని,  కీర్తి సమాధానం చెప్పలేక తడబడిందని, దాంతో తనకు అనుమానం వచ్చిందని శ్రీనివాస రెడ్డి చెప్పారు. తాను తాగి వచ్చి తన భార్య రజితను తిట్టాననీ దాంతో ఆమె ఎక్కడికో వెళ్లిపోయిందని కీర్తి చెప్పిందని, తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన అన్నారు. 

వైజాగ్ వెళ్లిన విషయంపై గట్టిగా నిలదీయడంతో ఒకసారి కాలేజీ నుంచి వెళ్లానని, మరోసారి స్నేహితులతో వెళ్లానని చెప్పిందని, వాళ్ల కాంటాక్ట్ నెంబర్ కావాలంటే అప్పటికప్పుడు ఫోన్ కట్ చేసిందని కీర్తి బాబాయ్ కృష్ణా రెడ్డి చెప్పారు. రజిత చనిపోయిందని గుర్తించామని ఆయన చెప్పారు. 

Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో...

బంధువులం అందరం కలిసి కీర్తిని నిలదీశామని, దాంతో అమ్మ ఉరేసుకుందని మొదట తమతో చెప్పిందని కృష్ణా రెడ్డి చెప్పారు. ఆ తర్వాత కూడా నిలదీయడంతో చంటి అనేవాడు కాళ్లు పట్టుకుంటే తానే తల్లికి ఉరి వేశానని అంగీకరించిందని ఆయన చెప్పారు.

తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న తల్లిని పొట్టన పెట్టుకున్న కీర్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తల్లిని చంపి మూడో రోజుల పాటు శవం పక్కనే ప్రియుడితో కీర్తి గడిపింది. ఈ కేసుపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

click me!