జూనియర్ లెక్చరర్ పరీక్షలు: టీఎస్‌పీఎస్‌సీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం

By narsimha lodeFirst Published Mar 20, 2023, 10:14 PM IST
Highlights

జూనియర్  లెక్చరర్  పరీక్షల  విషయంలో  తెలంగాణ హైకోర్టు సోమవారంనాడు కీలక  ఆదేశాలు  జారీ  చేసింది.  
 


హైదరాబాద్: జూనియర్ లెక్చరర్  పరీక్షా ప్రశ్నాపత్రంపై  తెలంగాణ హైకోర్టు  సోమవారంనాడు  కీలక ఉత్తర్వులు  జారీ  చేసింది.  జూనియర్  లెక్చరర్  ప్రశ్నాపత్రం తెలుగులోనూ  ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.  పేపర్ - 2  ;ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లీష్ , తెలుగులో  ఇవ్వాలని హైకోర్టు  ఆదేశించింది.  టీఎస్ పీఎస్ సీ  ఇష్టానుసారం  పరీక్షలు నిర్వహించడం సరికాదని  హైకోర్టు  వ్యాఖ్యానించింది.

జూనియర్ లెక్చరర్ల  పరీక్షకు  సంబంధించి  రెండో  ప్రశ్నాపత్రాన్ని  ఇంగ్లీష్ లోనే  ఇశ్వాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయాన్ని  జూనియర్ లెక్చరర్ పరీక్ష  రాసే అభ్యర్ధులు వ్యతిరేకించాారు. ముఖ్యంగా తెలుగులో పీజీ  చదువుకున్న అభ్యర్ధులు  టీఎస్‌పీఎస్‌సీ తీసుకున్న నిర్ణయంతో  నష్టపోయే  అవకాశం ఉంది.

 ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ  అభ్యర్ధులు కోరారు.ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. కానీ  టీఎస్‌పీఎస్‌సీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో  కొందరు  అభ్యర్ధులు  తెలంగాణ హైకోర్టును  ఆశ్రయించారు.  టీఎస్‌పీఎస్‌సీ తీరుపై  హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం  చేసింది. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులను  భర్తీ చేసేందుకు గాను  టీఎస్‌పీఎస్‌సీ  ఇటీవల నోటిఫికేషన్ జారీ  చేసింది.    ఈ పోస్టుల భర్తీకి  సంబంధించి  ఈ ఏడాది డిసెంబర్  20వ తేదీ నుండి  ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను  టీఎస్‌పీఎస్‌సీ   చేపట్టింది. 
  

click me!