బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. 10 గంటల పాటు కవితను విచారించారు.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. సోమవారం నాడు ఉదయం పదిన్నర గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.ఇవాళ ఉదయం అరుణ్ రామచంద్రపిళ్లైతో కవితను కలిపి విచారించినట్టుగా సమాచారం. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.ఇవాళ సాయంత్రం సిసోడియా, అమిత్ ఆరోరాతో కలిపి కవితను విచారిస్తున్నారనే ప్రచారం సాగుతుంది.
ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి కవిత తరపున న్యాయవాదులు చేరుకున్నారు.. కవితను ఈడీ కాలర్యాయలం నుండి ఇంటికి తీసుకెళ్లేందుకు న్యాయవాదులు వచ్చారు. ఈడీ కార్యాలయంలోనే కవిత ఇంకా ఉన్నారు. ఈడీ కార్యాలయంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
ఈ నెల 11వ తేదీన తొలిసారి ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ నెల 11న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. ఇవాళ మాత్రం కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. కవిత ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు విచారణకు రావాలని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నెల 18న మాగుంట శ్రీనివాసులు రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహచించిందని ఈడీ , సీబీఐలు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.
also read:ఆరు గంటలుగా కొనసాగుతున్న కవిత విచారణ.. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో విచారించిన అధికారులు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాను కవిత ప్రతినిధిగా వ్యవహరించినట్టుగా అరుణ్ రామచంద్రపిళ్లై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వాంగ్మూలాన్ని అరుణ్ రామచంద్రపిళ్లై వెనక్కి తీసుకుంటానని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.