గుర్తింపు లేని చైతన్య నారాయణ కాలేజీలపై చర్యలు తీసుకొండి:హైకోర్టు

By narsimha lodeFirst Published Feb 27, 2020, 4:56 PM IST
Highlights

గుర్తింపు లేని నారాయణ, చైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది. గురువారం నాడు ఇంటర్ బోర్డు హైకోర్టుకు గుర్తింపు లేని నారాయణ, చైతన్య కాలేజీలపై వివరాలను అందించింది.

హైదరాబాద్: పరీక్షలు మూసివేసిన తర్వాత  అనుమతి లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని  ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది.  గుర్తింపు లేని నారాయణ, చైతన్య  కాలేజీలపై సామాజిక కార్యకర్త రాజేష్ దాఖలు చేసిన  ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై  హైకోర్టు విచారించింది.

అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ లేని కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. గుర్తింపులేని కళాశాలలపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ఇంటర్ బోర్డు. అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ లేని కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్టుగా  ఇంటర్ బోర్డు ప్రకటించింది.

also read:నాంపల్లి కోర్టు ముందు హాజరైన కవిత

మార్చి 4వ తేదీ నుండి  పరీక్షలు ఉన్నందున  ఇప్పుడు కాలేజీలు మూసివేస్తే  దాని ప్రభావం విద్యార్ధులపై  పడుతోందని ఇంటర్ బోర్డు హైకోర్టుకు చెప్పింది. గుర్తింపు లేని కాలేజీల్లో  29,800 మంది విద్యార్థులు ఉన్నారని బోర్డు స్పష్టం చేసింది. అగ్నిమాపక శాఖ నుండి  అనుమతి లేని కాలేజీల్లో కూడ పరీక్ష కేంద్రాలు ఉన్న విషయాన్ని బోర్డు ప్రకటించింది. 

ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఈ కాలేజీలను మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని  ఇంటర్ బోర్డు హైకోర్టును అభ్యర్ధించింది. ఈ కాలేజీలపై చర్యలు తీసుకొని ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

 

click me!