నాంపల్లి కోర్టు ముందు హాజరైన కవిత

Published : Feb 27, 2020, 11:28 AM ISTUpdated : Feb 27, 2020, 05:27 PM IST
నాంపల్లి కోర్టు ముందు హాజరైన కవిత

సారాంశం

నాంపల్లి కోర్టు ముందు టీఆర్ఎస్ ఎంపీ కవిత గురువారం నాడు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ముందు హాజరయ్యారు. 


హైదరాబాద్: మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కవిత గురువారం నాడు ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో  ఆమె కోర్టు ముందు  హాజరయ్యారు.

2010లో జరిగిన  ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కవితతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమె ఇవాళ నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యారు.

Also read:అనుచరులకు పట్టం : డీసీసీబీల్లో పట్టు కోసం చక్రం తిప్పుతున్న మంత్రులు

ఇదే కేసులో ఏ-3 గా ఉన్న  బీజేపీ నేత ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఝాన్సీ మరణించిన విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఇక ఇదే కేసులో  ఏ-2, ఏ-4 గా ఉన్న వారు  కోర్టుకు హాజరు కాలేదు. దీంతో  కోర్టు కేసును వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది..

PREV
click me!

Recommended Stories

ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే