బండి సంజయ్‌కి ఊరట: జైలు నుండి విడుదలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Jan 5, 2022, 3:23 PM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను విడుదల చేయాలని  తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. 


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ను విడుదల చేయాలని Telangana High Court బుధవారం నాడు ఆదేశించింది.బండి సంజయ్ రిమాండ్ రిపోర్టుపై హైకోర్ట్ Stay  విధించింది. బండి సంజ్ ను విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తనపై దాఖలు చేసిన Remand Report ను క్యాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ తరపు న్యాయవాది మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.

317 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం నాడు కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరు పరిస్తే కరీంనగర్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది.  

Latest Videos

undefined

also read:హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్: రిమాండ్ రిపోర్టు క్వాష్ కోరుతూ పిటిషన్

తమనపై బనాయించిన 333 సెక్షన్ పై కూడా  బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ విషయమై బండి సంజయ్ తరపు న్యాయవాదులు కూడా కరీంనగర్ కోర్టులో వాదించిన విషంయ తెలిసిందే. రిమాండ్ రిపోర్ట్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించిన కోర్టు ఈ రిమాండ్ రిపోర్టుపై స్టే విధించింది. 

బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీ కార్యాలయాల్లో మౌన దీక్షలు నిర్వహించారు. మరో వైపు సాయంత్రం పూట క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. హైద్రాబాద్ లో నిర్వహించే క్యాండిల్ ర్యాలీలో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్ ను కేంద్ర మత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం నాడు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు తప్పుబట్టారు. మరో వైపు 317 జీవో అంశం ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను కలవరపరుస్తుంది.

317 జీవోను రద్దు చేయాలని  ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టేమ వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ విషయమై  సీఎం జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఉపాధ్యాయ, ఉద్యోగులకు నష్టం చేసే ఈ జీవోను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్ తో ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు బీజేపీ మద్దతును ప్రకటించింది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగి అరెస్టయ్యాడు. 

బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంపై కూడా తెలంగాణ బీజేపీ నేతలు తప్పు బడుతున్నారు. బండి సంజయ్ పై నమోదు చేసిన  సెక్షన్ల పై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహరశైలిపై కూడా బీజేపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన సందర్భాలు గుర్తుకు రాలేదా అంటూ కిషన్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. 
 

 

click me!