కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకోండి, తెలంగాణ సర్కార్ ప్రకటన

By Siva KodatiFirst Published Jan 5, 2022, 3:17 PM IST
Highlights

తెలంగాణలో (telangana) కరోనాతో (corona death) మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.50 వేల పరిహారం (corona death ex gratia) అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో (telangana) కరోనాతో (corona death) మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.50 వేల పరిహారం (corona death ex gratia) అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఎక్స్‌గ్రేషియా పొందేందుకు గాను మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను చేసుకోవాలని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే కొందరు దరఖాస్తు చేసుకోగా.. చాలామంది ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ దరఖాస్తులను డీడీఎంఏలు పరిశీలించి అర్హత ఉందని నిర్ధారిస్తే వారికి పరిహారం అందుతుంది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా జిల్లా కమిటీలు ఈ క్లెయిమ్స్ పరిష్కరించాల్సి ఉంటుంది. పరిహారానికి అర్హత ఉందని డీడీఎంఏ నిర్ధారిస్తే, 30 రోజుల్లోగా అర్హుల బ్యాంకు ఖాతాకు నగదు జమ అవుతుంది. ఇందుకోసం బ్యాంకు ఖాతాకు ఆధార్ సంఖ్య అనుసంధానమై ఉండాలి..

ALso Read:coronavirus: జేజే హాస్పిట‌ల్‌లో 61 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్‌

కరోనా పరిహారం కోసం రాష్ట్రాలు అందుబాటులో ఉంచే నిర్దేశిత ఫారాలను నింపాలి. దీనితో పాటు కరోనాతో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర పత్రాల రాష్ట్రంలోని 4,500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లను జతచేసి మీ సేవా కేంద్రాలకు సమర్పించాలి. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉండే కోవిడ్ మరణాల నిర్ధారణ కమిటీ (డీడీఎం) కరోనా మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని.. దీని అనంతరం ఎక్స్‌గ్రేషియాను మరణించిన వారి కుటుంబసభ్యులు, లేదా దగ్గరి బంధువుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని పేర్కొంది.

ఇకపోతే. దేశంలో ఇప్పటివరకు 2,135 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. వీరిలో ఇప్పటివరకు 828 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653 నమోదయ్యాయి. ఆ తర్వాత 464 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

click me!