మరియమ్మ డెడ్‌బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించాలి: అడ్డగూడూరు కస్టోడియల్ డెత్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Jun 24, 2021, 2:58 PM IST
Highlights

అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మరణించిన మరియమ్మ మృతదేహనికి రీ పోస్టుమార్టం నిర్వహించాలన తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మరణించిన మరియమ్మ మృతదేహనికి రీ పోస్టుమార్టం నిర్వహించాలన తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో  మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై  ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  రీపోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్లో సమర్పించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ మరణించిందని  పిటిషనర్ ఆరోపించారు.

also read:దళిత మహిళ లాకప్ డెత్... గవర్నర్ కు ఉత్తమ్, భట్టి లేఖ

ఈ విషయమై సమగ్ర నివేదికను అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ పిటిషన్ పై  విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అడ్డగూడూరు కస్టోడియల్ డెత్‌‌పై సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎల్పీ నేత విమర్శల తర్వాత ఇందుకు బాధ్యులను చేస్తూ  పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటేసింది ప్రభుత్వం.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరియమ్మ ఈ నెల 18న  కస్టోడియల్ డెత్ చోటు చేసుకొంది. ఈ నెల 15న మరియమ్మ ఆమె కొడుకుతో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని  పిటిషనర్  శశికిరణ్ తెలిపారు. ఈ ఘటనపై జ్యూడిషీయల్ విచారణ నిర్వహించాలని ఆలేరు మేజిస్ట్రేట్ ను ఆదేశించింది హైకోర్టు. 


 

click me!