యువగాయని శ్రావణి పాటకు ఫిదా అయిన కేటీఆర్... ఛాన్స్ ఇస్తామన్న తమన్, దేవీశ్రీ

Published : Jun 24, 2021, 01:41 PM IST
యువగాయని శ్రావణి పాటకు ఫిదా అయిన కేటీఆర్... ఛాన్స్ ఇస్తామన్న తమన్, దేవీశ్రీ

సారాంశం

యువగాయని గొంతెత్తి ఆలపించిన తెలంగాణ పాటకు కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆమె గాత్రంలోని మాధుర్యానికి ముగ్దులయ్యారు. సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, తమన్ లో ఆమె గాత్రమాధుర్యానికి మెస్మరైజ్ అయి.. భవిష్యత్ లో తాము నిర్వహించే షోల్లో ఆమెకు అవకాశం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

వివరాల్లోకి వెడితే.. మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి అద్భుతంగా పాడుతుంది. ఆమె పాటకు ముగ్ధుడైన సురేంద్ర తిప్పారాజు అనే నెటిజన్.. పాట వీడియోను ట్విటర్ లో షేర్ చేస్తూ కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు. 

‘మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని స్వరం మైమరిపించేలా ఉంది. ఆమె టాలెంట్ కు మీ సహకారంతో పాటు, ఆశీస్సులూ అవసరం’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతోపాటు శ్రావణి పాడిన ‘రేలా రే రేలా రే’ అనే పాటను షేర్ చేశాడు. 

సీన్ రివర్స్.. అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య... !...

ఈ ట్వీట్ మీద కేటీఆర్ స్పందించారు. శ్రావణిలో అద్భుతమైన టాలెంట్ ఉందంటూ ప్రశంసించారు. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్లు దేవీశ్రీ ప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేశారు. 

దీనిమీద తమన్ స్పందిస్తూ..  శ్రావణి అద్భుతమైన సింగర్‌ అని మెచ్చుకున్నాడు. ఇక దేవీశ్రీ ప్రసాద్ ఆమె స్వరానికి ఫిదా అయ్యానని అన్నాడు. ఇంతటి ప్రతిభావంతురాలిని తమ దృష్టికి తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. తాము భ‌విష్య‌త్‌లో నిర్వ‌హించే షోలలో శ్రావణికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే