సీన్ రివర్స్.. అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య... !

Published : Jun 24, 2021, 12:53 PM IST
సీన్ రివర్స్.. అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య... !

సారాంశం

అత్తింటి వేధింపులు తట్టుకోలేక కోడళ్లు ఆత్మహత్య చేసుకోవడం లేదా అత్తింటివారి చేతిలో హత్యకు గురికావడం అనాదిగా వింటున్నదే. అయితే దీనికి విరుద్ధంగా జయశంకర్ భూపాలపల్లిలో అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెడితే.. తెలంగాణలోని జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అత్తామాల వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఓ అల్లుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా, గార్లలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం బజార్ కు చెందిన బరిబద్దల రాకేష్(26)కు నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన స్నేహతో ఏడాది కిందట వివాహం జరిగింది. 

అయితే, పెళ్లైన నాటినుంచి అత్తామామలు మునీందర్, రేణుకతో పాటు ఇతర బంధువులు రాకేష్ ను వేధిస్తున్నారు. ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నావంటూ.. భార్యను ఎలా పోషిస్తావంటూ ఫోన్ లో మానసికంగా వేధింపులకు గురి చేసేవారు. 

దీంతో రాకేష్ బుధవారం ఉదయం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడు రాకేష్ భార్య స్నేహ.. ఇరవై రోజుల క్రితమే పండంటి బాబుకు జన్మనిచ్చింది. మృతుడి తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై డి. నాగేశ్వరరావు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే