గణతంత్ర వేడుకలు: కెసిఆర్ కు హైకోర్టు షాక్, తమిళిసైకి ఊరట

By narsimha lode  |  First Published Jan 25, 2023, 3:32 PM IST

రాష్ట్ర ప్రభుత్వం  గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాల్సిందేనని  తెలంగాణ హైకోర్టు  తేల్చి చెప్పింది.  


హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం  బుధవారం నాడు తీర్పును వెల్లడించింది.  రిపబ్లిక్ డే  వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం  హైకోర్టు విచారణ నిర్వహించింది.

ఐదు లక్షలతో సభ నిర్వహించడానికి  కరోనా నిబంధనలు  ఏమయ్యాయని  పిటిషనర్ తరపు  న్యాయవాది ప్రశ్నించారు.   ఈ ఏడాది రాజ్ భవన్ లో నే  రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నట్టుగా  ఏజీ చెప్పారు.
 కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన  సర్క్కులర్ ను రాష్ట్ర ప్రభుత్వం  ధిక్కరించిందని  పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో  రిపబ్లిక్ డే ఉత్సవాలను  పరిమితమైన సంఖ్యలో  ఆహ్వానితుల మధ్య నిర్వహించిన  విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు అయితే కరోనా నిబంధనలు ప్రస్తుతం లేవని కూడ ఆయన  వాదించారు.    

Latest Videos

undefined

రాజ్ భవన్ లో   రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించడాన్ని రాజకీయం చేయడం తగదని  అడ్వకేట్ జనరల్ కోరారు.   పరేడ్  ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించుకోవాలని హైకోర్టు  ప్రభుత్వానికి సూచించింది. రిపబ్లిక్ డే  నిర్వహణ విషయమై కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ ను  పాటించాలని ప్రభుత్వానికి  హైకోర్టు కోరింది.   

దేశంలోని అన్ని రాష్ట్రాలు  గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం  ఈ నెల  19 తేదీల్లో  సర్క్యులర్  జారీ చేసింది.రిపబ్లిక్ డే  ఉత్సవాలను  రాజ్ భవన్ లో నిర్వహించాలని ఈ నెల  18న ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.  గత ఏడాది కూడా రాజ్ భవన్ లోనే నిర్వహించారు.   

also read:రిపబ్లిక్ డే వేడుకలు అధికారికంగా నిర్వహించాలి:తెలంగాణ హైకోర్టులో పిటిషన్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్,  కేసీఆర్ మధ్య గ్యాప్ కారణంగా   రిపబ్లిక్ డే వేడుకలు  రాజ్ భవన్ కు పరిమితమయ్యాయనే  ప్రచారం కూడా లేకపోలేదు.  రాజ్ భవన్ లో కూడా  ఏర్పాట్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందని అధికార పార్టీ చెబుతుంది.  ఈ వేడుకల విషయంలో ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరిస్తున్న విషయాన్ని  బీఆర్ఎస్ నేతలు గుర్తు  చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  బహిరంంగానే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం  రాజ్ భవన్ కు  గౌరవం ఇవ్వడం లేదన్నారు.  రాష్ట్రంలో చోటు  చేసుకున్న పరిణామాలను  ఆమె ప్రస్తావించారు.  గవర్నర్ చేసిన విమర్శలపై  బీఆర్ఎస్ నేతలు, మంత్రులు తీవ్రంగా  తప్పుబట్టిన విషయం తెలిసిందే.   అసెంబ్లీ ామోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని మంత్రులు  విమర్శిస్తున్నారు.

click me!