అందుకు నేనెలా బాధ్యుడిని: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారనే ప్రచారంపై ఎమ్మెల్యే ఈటల రియాక్షన్

Published : Jan 25, 2023, 02:18 PM ISTUpdated : Jan 25, 2023, 02:24 PM IST
అందుకు నేనెలా బాధ్యుడిని: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారనే ప్రచారంపై ఎమ్మెల్యే ఈటల రియాక్షన్

సారాంశం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారనే ప్రచారంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాను రాష్ట్ర అధ్యక్షుడినంటూ ప్రచారం చేస్తున్నారని.. దానికి తానెలా బాధ్యుడినని ప్రశ్నించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారనే ప్రచారంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాను రాష్ట్ర అధ్యక్షుడినంటూ ప్రచారం చేస్తున్నారని.. దానికి తానెలా బాధ్యుడినని ప్రశ్నించారు. తనకు ఆ  వివాదంతో సంబంధం లేదని అన్నారు. తెలంగాణ ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

 గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని అన్నారు. అదే విషయంపై ప్రశ్నిస్తే బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. స్పీకర్ నిష్పాక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నందుకు తనను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారనే లీక్ వచ్చిందని.. సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరి తాము ఖండిస్తున్నామని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే