చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం: విచారణ జూలై 15కి వాయిదా

By Siva KodatiFirst Published Jul 6, 2021, 3:27 PM IST
Highlights

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆఫ్‌లైన్‌లో దాఖలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆఫ్‌లైన్‌లో దాఖలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ఆ రోజున అందరూ వాదనలు వినిపించాలని ఇకపై సమయం కోరవద్దని హైకోర్టు ఆదేశించింది.

అంతకుముందు జూన్ 22న జరిగిన విచారణ సందర్భంగా తాను జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు చెన్నమనేని హైకోర్టుకు తెలిపారు. చెన్నమనేని దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Also Read:జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేశా.. హైకోర్టుకు తెలిపిన చెన్నమనేని రమేశ్

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది.

click me!