భట్టి విక్రమార్కతో మల్లు రవి భేటీ.. రేవంత్‌తో సమన్వయం కోసమేనా..?

By Siva KodatiFirst Published Jul 6, 2021, 3:09 PM IST
Highlights

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన రేవంత్ రెడ్డిని కలిసేందుకు భట్టి విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి చర్చించింది.

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన రేవంత్ రెడ్డిని కలిసేందుకు భట్టి విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన భట్టి విక్రమార్కతో ఆయన సోదరుడు మల్లు రవి భేటి కావడం చర్చనీయాంశమైంది.

ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చేందుకు భట్టితో భేటి అయిన మల్లు రవి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎంత ముఖ్యమో సీఎల్పీ నాయకుడు అంతే ముఖ్యమన్నారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసే క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలెవరినీ ఇబ్బంది పెట్టొద్దని ఆయన కోరారు. కార్యకర్తలు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు.   

Also Read:టీ.కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలే.. త్వరలోనే కమిటీ, భట్టికీ కేసీ వేణుగోపాల్ హామీ

కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత శనివారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్‌తో భట్టి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్ధితి, వ్యవహారాలపై ఇద్దరు నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ మౌలిక, మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే నిర్ణయాలు, తెలంగాణలో పార్టీ పరంగానే సమిష్టి నిర్ణయాల అంశంపై చర్చిస్తున్నారు. 

పార్టీ ప్రయోజనాలపై ఏకపక్ష నిర్ణయాలుండవని భట్టీకి వేణుగోపాల్ హామీ ఇచ్చారు. సీఎల్పీతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు వుండవని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం కనుసన్నల్లోనే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు, నిర్ణయాలు వుంటాయని వేణుగోపాల్ తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

click me!