విద్యార్ధులకు గుడ్‌న్యూస్: గురుకులాల రీ ఓపెన్‌కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Published : Oct 20, 2021, 05:12 PM ISTUpdated : Oct 20, 2021, 05:13 PM IST
విద్యార్ధులకు గుడ్‌న్యూస్: గురుకులాల  రీ ఓపెన్‌కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సారాంశం

రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల ఓపెన్‌కి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు దగ్గర పడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయమై కోర్టును అనుమతిని కోరింది. దీంతో హైకోర్టు గురుకులాలు తెరిచేందుకు అనుమతిని ఇచ్చింది.

హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న Residential schools తెరిచేందుకు తెలంగాణ  హైకోర్టు బుధవారం నాడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి ప్ర‌భుత్వం హైకోర్టు అనుమ‌తిని కోరింది. దీంతో Telangana High court గురుకులాలు తెరిచేందుకు అనుమతించింది.విద్యా సంస్థ‌ల్లో కరోనా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని అడ్వకేట్ జనరల్ ప్ర‌సాద్  హైకోర్టుకు తెలిపారు. గురుకులాల్లో ప్ర‌త్య‌క్ష‌, ఆన్‌లైన్ బోధ‌న చేప‌ట్టాల‌ని కోర్టు ప్ర‌భుత్వానికి సూచించింది.రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థ‌లు  సెప్టెంబర్ 1వ తేదీ నుండి  తెరిచేందుకు గ‌తంలో హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. గురుకుల విద్యాల‌యాల ప్రారంభానికి అనుమ‌తి ఇవ్వ‌లేదు.

also read:సంప్రదాయ పద్ధతిలోనే మూల్యాంకనం.. ఏపీపీఎస్సీకి హై కోర్టు షాక్...

తాము ఆదేశాలు జారీ చేసే వ‌ర‌కు గురుకులాల‌ను తెర‌వొద్ద‌ని కోర్టు ఆదేశించింది.Inter exams దృష్ట్యా గురుకులాల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోర్టుకు విజ్ఞ‌ప్తి చేసింది. దీంతో గ‌తంలో ఇచ్చిన ఆదేశాల‌ను హైకోర్టు స‌వ‌రించింది. విద్యార్ధులకు ప్రత్యక్ష తరగతుల విషయంలో విద్యా సంస్థలదే నిర్ణయమని ఆ సమయంలో హైకోర్టు పేర్కొంది. మరో వైపు విద్యార్ధులను ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలని బలవంతం చేయవద్దని కూడ సూచించింది.

అయితే గురుకులాలకు మాత్రం అనుమతివ్వలేదు. పరీక్షల దగ్గర పడడంతో హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది.విద్యా సంస్థలు తెరిచే విషయమై గతంలో ప్రైవేట్ టీచర్ బాలకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం వినతి మేరకు ఇవాళ ఈ ఉత్తర్వుల్లో మార్పులు చేసింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్