టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఈ నెల 18వరకు స్టే పొడిగింపు: తెలంగాణ హైకోర్టు

By narsimha lode  |  First Published Jul 11, 2023, 5:19 PM IST

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై  ఈ నెల  18వ తేదీ వరకు  స్టేను  తెలంగాణ హైకోర్టు పొడిగించింది. 


హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై  ఈ నెల  18వ తేదీ వరకు  స్టే ను తెలంగాణ హైకోర్టు  మంగళవారంనాడు  పొడిగించింది. గతంలో ఇచ్చిన స్టేని  హైకోర్టు పొడిగించింది.

 బదిలీలపై రూపొందించిన  మార్గదర్శకాలను సవాల్ చేస్తూ  తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై  మంగళవారంనాడు  హైకోర్టు విచారణ  నిర్వహించింది.  టీచర్ల బదిలీల కోసం  రాష్ట్ర ప్రభుత్వం  ఈ ఏడాది జనవరి  25న  జీవో నెంబర్ 5 ను జారీ చేసింది. 

Latest Videos

 ఈ జీవోను  కొందరు  ఉపాధ్యాయులు హైకోర్టులో సవాల్  చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు  టీచర్లకు  నష్టం కల్గించేలా  ఉన్నాయని  పిటిషనర్ల  తరపు న్యాయవాది వాదించారు.నిబంధనలకు విరుద్దంగా ఈ జీవోలు జారీ చేశారని  కూడ  పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. 

ఉపాధ్యాయుల  బదిలీలు,  పదోన్నతులకు  ప్రభుత్వం  గత ఏడాది షెడ్యూల్ ఇచ్చింది.  నాన్ 
స్పౌజ్ లు తమకు అన్యాయం జరిగిందని  కోర్టును ఆశ్రయించారు.  ఉపాధ్యాయుల బదిలీలు, సర్వీసుకు  సంబంధించిన  నిబంధనలను రూపొందించారని పిటిషనర్  కోర్టులో  వాదనలు విన్పించారు. కోర్టుకు వాస్తవాలు చెప్పడంలో  విద్యా శాఖ అధికారులు చొరవ చూపడం లేదని  మరికొందరు టీచర్లు  అభిప్రాయపడుతున్నారు.  కోర్టును ఆశ్రయించిన  ఉపాధ్యాయులు  లేవనెత్తిన వాదనల్లో  వాస్తవాలు ఏమిటో, అవాస్తవాలు ఏమిటో కోర్టుకు  వివరిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.


 

 

 
 

click me!