జైల్లో డాక్టర్లుంటారు.. అఖిలప్రియకు హైకోర్టులో చుక్కెదురు

By Siva KodatiFirst Published Jan 7, 2021, 5:02 PM IST
Highlights

అఖిలప్రియ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మెరుగైన వైద్యం కోసం తనను ఆసుపత్రికి తరలించాలని అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిని న్యాయస్ధానం.. జైల్లో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలిపింది

అఖిలప్రియ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మెరుగైన వైద్యం కోసం తనను ఆసుపత్రికి తరలించాలని అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిని న్యాయస్ధానం.. జైల్లో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలిపింది. జైల్లో వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని హైకోర్టు వెల్లడించింది.

రేపు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు పోలీసులు. అంతకుముందు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు గురువారం విచారణ చేపట్టింది.

Also Read:భూమా అఖిలప్రియ ఆరోగ్యం బాగా లేదు, బెయిలివ్వండి: విచారణ రేపటికి వాయిదా

అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

కాగా, ఓ భూ వివాదంలో ప్రవీణ్ రావు, సునీల్, నవీన్ అనే ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు తమ రిపోర్టులో అఖిలప్రియను ఏ1 గా పేర్కొన్నారు. 

click me!