కేసీఆర్‌కు లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్: డాక్టర్ ఏంవీరావు

Published : Jan 07, 2021, 04:38 PM ISTUpdated : Jan 07, 2021, 04:44 PM IST
కేసీఆర్‌కు లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్: డాక్టర్ ఏంవీరావు

సారాంశం

కేసీఆర్ ఊపిరితిత్తుల్లో చిన్న ఇన్‌ఫెక్షన్  ఉందని యశోద ఆసుపత్రి డాక్టర్ ఎంవీ రావు చెప్పారు.

హైదరాబాద్: కేసీఆర్ ఊపిరితిత్తుల్లో చిన్న ఇన్‌ఫెక్షన్  ఉందని యశోద ఆసుపత్రి డాక్టర్ ఎంవీ రావు చెప్పారు.

గురువారం నాడు మధ్యాహ్నం యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకొన్నారు.  ఈ పరీక్షల తర్వాత కేసీఆర్ తిరిగి ఇంటికి వెళ్లారు. ఛాతీలో మంట కారణంగా ఆయన ఆసుపత్రిలో  పరీక్షలు చేయించుకొన్నారని చెప్పారు.

also read:యశోద ఆసుపత్రిలో కేసీఆర్: వైద్యుల పరీక్షలు

కేసీఆర్ కు ఐదు రోజుల పాటు మందులు ఇచ్చినట్టుగా చెప్పారు. కేసీఆర్ నుండి తీసుకొన్న బ్లడ్ రిపోర్టులు, 2 డీ ఎకో రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. 

ప్రతి శీతాకాలం బ్రాంకెయిటీస్ సమస్య  ఉంటుందని ఆయన చెప్పారు. కేసీఆర్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. చాతీలో  మంట కారణంగా యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ గురువారం నాడు మధ్యాహ్నం పరీక్షలు చేయించుకొన్నారు.కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్  ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR