ప్రవేశ పరీక్షలు: ఈ నెల 23 లోపుగా కౌంటర్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Aug 17, 2020, 3:04 PM IST
Highlights

ప్రవేశ పరీక్షలు,చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఈ నెల 23 తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది.

హైదరాబాద్: ప్రవేశ పరీక్షలు,చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఈ నెల 23 తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది.

ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ విషయమై దాఖలైన పిటిషన్లపై సోమవారం నాడు హైకోర్టు విచారించింది.ఐఐటీ, జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని అడ్వకేట్ జనరల్, పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

also read:సెప్టెంబర్‌లో తెలంగాణలో ఎంసెట్: హైకోర్టు అనుమతి కోరనున్న ప్రభుత్వం

ఈ కేసుపై విచారణ రేపు కూడ ఉందని వారు గుర్తు చేశారు.ప్రవేశ పరీక్షల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నందున విచారణను ఈ నెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

అయితే ఈ విచారణ ప్రారంభమయ్యేలోపుగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 23వ తేదీలోపుగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల నిర్వహణను హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. 
 

click me!