వాగులో కారుతో పాటు కొట్టుకుపోయిన శ్రీనివాస్: స్పందించిన కేటీఆర్

Published : Aug 17, 2020, 12:59 PM IST
వాగులో కారుతో పాటు కొట్టుకుపోయిన శ్రీనివాస్: స్పందించిన కేటీఆర్

సారాంశం

ముగ్గురు స్నేహితులతో పాటు వెళ్తున్న శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ కార్యకర్త సిద్ధిపేట జిల్లాలో వాగులో కారుతో పాటు కొట్టుకుపోయాడు. ఈ సంఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని వాగులో కారుతో శ్రీనివాస్ పాటు కొట్టుకుపోయిన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు స్పందించారు. సిద్ధిపేట కలెక్టర్ తో కేటీఆర్ మాట్లాడారు. సంఘటనా స్థలానికి చేరుకుని సిద్ధిపేట ఆర్డివో గాలింపు చర్యలు చేపట్టారు. 

రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి  టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో బయలుదేరాడు. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో పాటు నలుగురు వాగులో పడి పోయారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు 

విషయం తెల్సుకున్న మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయాన్నే  సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీఓ సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

బిఆర్ఎస్ అకౌంట్లో రూ.1400 కోట్లు... ఎలా వచ్చాయి? : నిలదీసిన మంత్రి వివేక్
మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu