దిశ నిందితుల ఎన్ కౌంటర్‌: అమికస్ క్యూరీ వాదన ఇదీ

By narsimha lode  |  First Published Mar 6, 2023, 4:35 PM IST


దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  తెలంగాణ హైకోర్టులో  ఇవాళ  విచారణ జరిగింది.  ఎణ్ కౌంటర్ కు పాల్పడిన పోలీసులపై  కేసు నమోదు  చేయాలని  అమికస్ క్యూరీ ప్రకాష్ రెడ్డి  కోరారు. 


హైదరాబాద్: దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై   హత్య  కేసును నమోదు  చేయాలని  అమికస్ క్యూరీ  దేశాయి ప్రకాష్ రెడ్డి  తెలంగాణ హైకోర్టును  కోరారు.దిశ నిందితుల  ఎన్ కౌంటర్ పై సోమవారం నాడు  తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ  కేసును స్వతంత్ర దర్యాప్తు  సంస్థతో  దర్యాప్తు  చేయించాలని ప్రకాష్ రెడ్డి   హైకోర్టును  కోరారు.  అయితే ఈ విషయమై  వాదనలు విన్పించేందుకు  సమయం కావాలని ప్రభుత్వం  తరపు న్యాయవాది కోరారు.  దీంతో  ఈ  కేసు విచారణను  తెలంగాణ హైకోర్టు  ఈ నెల  29వ తేదీకి వాయిదా వేసింది. 

2019  నవంబర్  28వ తేదీన  రాత్రి  దిశపై  షాద్ నగర్ కు సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద  అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు నిందితులు. ఆ తర్వాత  అక్కడే  దిశ మృతదేహన్ని  పెట్రోల్  పోసి దగ్ధం  చేశారు. ఈ ఘటన జరిగిన  రెండు  రోజులకే   నలుగురు నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు  చెందిన   జొల్లు శివ,. జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు, మహహ్మద్ ఆరిఫ్ లను పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన  సమయంలో   పెద్ద ఎత్తున ప్రజలు  పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి  నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్  చేశారు.

Latest Videos

ఈ కేసు సీన్ రీ కన్ స్ట్రక్షన్  చేసేందుకు  చటాన్ పల్లికి  నలుగురు నిందితులను  పోలీసులు తీసుకు వచ్చారు. ఈ సమయంలో  నిందితులు తప్పించుకొనే ప్రయత్నంలో  ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు ప్రకటించారు.  దిశ నిందితుల ఎన్ కౌంటర్  2019 డిసెంబర్  6వ తేదీన చోటు  చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ పై  పౌరహక్కుల సంఘం నేతలు సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ పై   విచారణ  నిర్వహించిన సుప్రీంకోర్టు  సిర్కూర్కర్ కమిషన్ ను ఏర్పాుటు చేసింది.

also read:దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: అమికస్ క్యూరీగా దేశాయి ప్రకాష్ రెడ్డి నియామకం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  సిర్కూర్కర్ కమిషన్ సుదీర్థంగా విచారణ  నిర్వహించింది.  ఈ ఎన్ కౌంటర్ బూటకమని  ఈ కమిషన్ తేల్చి చెప్పింది.  ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న  పోలీసులపై హత్య  కేసు నమోదు  చేయాలని కూడా కమిషన్ సూచించింది.   ఈ కేసు విచారణను  తెలంగాణ హైకోర్టు  నిర్వహించాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది.  దీంతో  తెలంగాణ హైకోర్టు ఈ కేసును విచారిస్తుంది. 

దిశ నిందితుల  ఎన్ కౌంటర్  పై సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై సీనియర్ న్యాయవాది  దేశాయి  ప్రకాష్ రెడ్డిని  అమికస్ క్యూరీగా 2022 జూలై  4వ తేదీన  నియమించింది.  ఇవాళ  నిర్వహించిన  విచారణలో  అమికస్ క్యూరీ  ప్రకాష్ రెడ్డి తన వాదనలను విన్పించారు.
 

click me!