స్థాయి దిగజారి మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు.. కోమటిరెడ్డి ఆడియో క్లిప్‌పై మహేష్ గౌడ్

Published : Mar 06, 2023, 04:29 PM IST
స్థాయి దిగజారి మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు.. కోమటిరెడ్డి ఆడియో క్లిప్‌పై మహేష్ గౌడ్

సారాంశం

టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌లపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టుగా చెబుతున్న ఫోన్ కాల్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌లపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టుగా చెబుతున్న ఫోన్ కాల్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. చెరుకు సుధాకర్, కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి వ్యవహారం ఏఐసీసీకి నివేదించినట్టుగా తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌లో అలా  మాట్లాడటం సరికాదని అన్నారు. ఎవరు.. ఎవర్ని కించపరిచేలా మాట్లాడినా ఒప్పుకోమని స్పష్టం చేశారు. స్థాయి దిగజారి మాట్లాడటం ఎవరికీ మంచిది కాదని  అన్నారు.

ఇక, చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహాస్‌లను తమ వాళ్లు చంపేస్తారని కోమటిరెడ్డి ఫోన్ చేసి బెదిరించినట్టుగా చెబుతున్నఆడియో రికార్డింగ్ ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోమటిరెడ్డికి చెందినదిగా  చెబుతున్న ఆ ఆడియోలో.. ‘‘నువ్వు నీ నాన్న వీడియో చూశావా?. నన్ను వందసార్లు తిట్టాడు. నెల రోజులు ఓపికగా వాటిని విన్నాను. నా మద్దతుదారులు వందలాది కార్లలో బయలుదేరారు. వారు మిమ్మల్ని ఎక్కడ కనిపించినా చంపేస్తారు. నేను లక్షల మందిని బతికించినా.. వానికి ఎంత ధైర్యం రా. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి.. వాన్ని ఒదిలిపెట్టారా? వార్నింగ్ ఇస్తున్నా?. నిన్ను కూడా చంపుతారు.. నీ ఆస్పత్రిని కూడా కూలగొడతారు.

Also Read: భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప వేరే ఉద్దశం లేదు.. వివాదాస్పద ఆడియో క్లిప్‌పై కోమటిరెడ్డి వివరణ..

మేము వెళ్లినం బయటకు.. ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తామని అంటున్నారు. క్షమాపణ చెప్పకపోతే నా వాళ్ళు చంపేస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపితే నేనొక్కడినే వెళ్లి  పరామర్శించాను. మీరు కౌన్సిలర్‌గా కూడా గెలవలేరు.. కానీ నన్ను విమర్శించే ధైర్యం చేస్తా’’ అని పేర్కొన్నారు. 

అయితే ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో సుధాకర్ మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీలో అవకాశం ఇస్తే మరింత బాగా పనిచేస్తానంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన మాటలపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా వివాదం చోటుచేసుకుందనే చర్చ టీ కాంగ్రెస్‌లో నడుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?