అధికారమిస్తే యూపీ తరహలో బుల్‌డోజర్లతో నిందితుల ఆస్తుల ధ్వంసం: బండి సంజయ్

By narsimha lode  |  First Published Mar 6, 2023, 3:56 PM IST

మహిళలపై దాడులు  కొనసాగుతున్నా  కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని  బండి సంజయ్  విమర్శించారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి  వస్తే  నిందితులు భయపడేలా చర్యలు తీసుకుంటామని  ఆయన  ప్రకటించారు. 



హైదరాబాద్:తెలంగాణలో బీజేపీ  అధికారంలోకి వస్తే  మహిళలపై అత్యాచారాలు, దాడులు  చేసే వారి ఆస్తులను   బుల్‌డోజర్లతో  ధ్వంసం  చేస్తామని  బండి సంజయ్  హెచ్చరించారు.

 మహిళలపై జరుగుతున్న  దాడులు, దౌర్జన్యాలను నిరసిస్తూ   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్   సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో దీక్షకు దిగాడు. ఈ  దీక్షనుద్దేశించి  ఆయన  ప్రసంగించారు.  

Latest Videos

రాష్ట్రంలో  ఏ సంఘటన జరిగినా  ముందుగా  స్పందించే పార్టీ బీజేపీయేనని  ఆయన  చెప్పారు. మహిళలపై దాడులపై   మహిళా మోర్చా విభాగం  కార్యకర్తలు  స్పందించిన  తీరును   ఆయన అభినించారు. మెడికో ప్రీతి  అంశంలో  అర్ధరాత్రి  మహిళా మోర్చా  శ్రేణులు ఆందోళనకు దిగిన విషయాన్ని  బండి సంజయ్ ఈ సందర్భంగా  ప్రస్తావించారు.  

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  మహిళలపై అత్యాచారాలు, దాడులు  చేస్తే  బుల్‌డోజర్లతో  నిందితుల ఆస్తులను ధ్వంసం  చేస్తున్న విషయాన్ని బండి సంజయ్  గుర్తు  చేశారు. యూపీ తరహ విధానాన్ని  తెలంగాణలో  అమలు చేస్తామన్నారు. 

మహిళల వైపు కన్నెత్తి చూడకుండా  నిందితులపై  చర్యలు తీసుకుంటామని  ఆయన  తేల్చి చెప్పారు.మహిళల జోలికి  రావాలంటే  భయపడేలా  చర్యలు తీసుకుంటామని  బండి సంజయ్  చెప్పారు. నిందితులపై  బహిరంగంగా  చర్యలు తీసుకుంటామన్నారు. 

తెలంగాణ రాష్ట్రం  ఏర్పాటైతే  సుఖ, సంతోషాలతో  జీవనం సాగిస్తామని భావించామన్నారు. కానీ  తెలంగాణ రాష్ట్రంలో  కూడా  మహిళలపై దాడులు, దౌర్జన్యాలు  కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం  చేశారు.  

రాష్ట్రంలోని పలు  జిల్లాల్లో  మహిళలపై జరిగిన దాడులను  బండి సంజయ్ ఈ సందర్భంగా  గుర్తు  చేశారు. మహిళలపై దాడులకు  పాల్పడిన నిందితులపై   చర్యలు తీసుకోలేదని   బండి సంజయ్  కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. 

మెడికో  ప్రీతి  ఆత్మహత్య విషయంలో  సీఎం కేసీఆర్ ఎందుకు  స్పందించలేదో  చెప్పాలని  బండి సంజయ్ ప్రశ్నించారు. దేశంలోని   ఇతర రాష్ట్రాల్లో  జరిగిన ఘటనలపై  కేసీఆర్  స్పందించారని  చెప్పారు. కానీ   మెడికో ప్రీతి  గురించి  నోరు మెదపలేదన్నారు. 


మెడికో ప్రీతి  కేసును నీరుగార్చే ప్రయత్నం  చేస్తున్నారని బండి సంజయ్  ఆరోపించారు. . ప్రీతి  కేసులో  ఏం జరిగిందో  వాస్తవాలను బయట పెట్టాలని  ఆయన  డిమాండ్  చేశారు.  ప్రీతి కేసులో  నిందితుడిని కాపాడే ప్రయత్నం  చేస్తున్నారని ఆయన  విమర్శించారు. 

ఆత్మహత్య చేసుకొనేంత  పిరికితనం ప్రీతికి లేదని  కుటుంబ సభ్యులు తనకు చెప్పారన్నారు.  ప్రీతి  ఆత్మహత్య  చేసుకొంటే  సూసైడ్  లేఖ  ఎందుకు  రాయలేదని  ఆయన  ప్రశ్నించారు.  ప్రీతి  ఆత్మహత్య  ఎలా  చేసుకుందో  కూడా ఇంతవరకు   బయట పెట్టలేదన్నారు.. ప్రీతి  మృతదేహనికి నాలుగు  రోజుల పాటు నిమ్స్ లో  చికిత్స  అందించారని   బండి సంజయ్  ఆరోపించారు. పోలీసులు ముందే  స్పందించి  ఉంటే  ప్రీతి  చనిపోయి ఉండేది కాదన్నారు. 

also read:సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి: ప్రీతి కుటుంబ సభ్యులకు బండి సంజయ్ పరామర్శ

మెడికో  ప్రీతి  ఆత్మహత్య విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం  వాస్తవాలను వక్రీకరిస్తుందని ఆయన  ఆరోపించారు. అలా  చేయకపోతే  ఈ విషయమై  సిట్టింగ్ జడ్జితో  విచారణ జరిపించాలని  డిమాండ్  చేశారు. 
 

click me!