తెలంగాణ గ్రూప్-3, 4 పరీక్షలపై స్టేకి హైకోర్టు నిరాకరణ: విచారణ ఈ నెల 13కి వాయిదా

By narsimha lode  |  First Published Jun 12, 2023, 4:20 PM IST

తెలంగాణ  గ్రూప్-3, 4  పరీక్షలపై  స్టే  ఇచ్చేందుకు  తెలంగాణ హైకోర్టు  నిరాకరించింది.  ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల  13కి వాయిదా వేసింది హైకోర్టు.


హైదరాబాద్:తెలంగాణ గ్రూప్-3, 4  పరీక్షలపై స్టే  ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు  నిరాకరించింది.  ఉద్యోగ నియామాకాల  ప్రక్రియను  నిలిపివేయలేమని  హైకోర్టు తేల్చి  చెప్పింది.  ఈ విషయమై    తెలంగాణ ప్రభుత్వం, టీఎస్‌పీఎస్‌సీకి  తెలంగాణ  హైకోర్టు  సోమవారంనాడు నోటీసులు  జారీ  చేసింది.  మరో వైపు ఈ కేసు  విచారణను ఈ నెల  13వ తేదీకి  వాయిదా వేసింది   హైకోర్టు.

గ్రూప్ 3, 4 లలో  టైపిస్ట్ కమ్  అసిస్టెంట్  పోస్టులున్నాయి. ఈ పోస్టులను  తొలగించాలని  101  పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై  సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు  చీఫ్ జస్టిస్  ఉజ్జల్ భయాన్  ధర్మాసనం   విచారణ నిర్వహించింది.  అయితే  పరీక్షలు నిర్వహించకుండా స్టే ఇచ్చేందుకు  హైకోర్టు  నిరాకరించింది.  జీవో  55, 136 పిటిషన్లను  కొట్టివేయాలని  పిటిషనర్లు కోరారు. అయితే ఈ విషయమై  తెలంగాణ  పబ్లిక్ సర్వీస్ కమిషన్ , ప్రభుత్వానికి   నోటీసులు  జారీ చేసింది  హైకోర్టు. ఈ పిటిషన్ పై  విచారణను  ఈ నెల  13కి వాయిదా వేసింది. 

Latest Videos

click me!