హైద్రాబాద్ నగరంలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు.
హైదరాబాద్: నగరంలోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి సోమవారం నాడు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో ఈ కార్యాలయంలో పనిచేసే అధికారులు భయంతో పరుగులు తీశారు. హైద్రాబాద్ లోని ఐటీ టవర్స్ లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి బాంబు బెదిరిపు ఫోన్ రావడంతో ఈ సమాచారం పోలీసులకు చేరవేశారు. పోలీసులు బాంబు స్వ్కాడ్ తో ఐటీ టవర్స్ కు చేరుకున్నారు.
undefined
ఐటీ టవర్స్ ను బాంబు స్వ్కాడ్ తో తనిఖీ చేస్తున్నారు.ఐటీ టవర్స్ లో బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుండడంతో ఐటీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు కార్యాలయ ఆవరణలో నిలబడి ఏం జరుగుతుందోనని చూస్తున్నారు. హైద్రాబాద్ బషీర్ బాగ్ లోని ఐటీ టవర్స్ లో బాంబు ఉందని పోలీసులకు ఫొన్ చేసి బాంబు ఉందని ఆగంతకుడు చెప్పాడు. పోలీసులతో ఫోన్ మాట్లాడుతూనే ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేశాడు.
బాంబు లేదని తేల్చిన బాంబు స్వ్కాడ్
ఐటీ కార్యాలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి బాంబు లేదని తేల్చి చెప్పారు. దీంతో ఐటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.