బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సీబీఐకి ఇవాళ ఫిర్యాదు చేసింది. గతంలో జాతీయ మహిళ కమిషన్ కు కూడ ఆమె చిన్నయ్యపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సోమవారం నాడు సీబీఐ ఫిర్యాదు చేసింది. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ న్యూఢిల్లీలోనే ఉంటున్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమిషన్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుండి ఇటీవలనే ఆమె డిశ్చార్జ్ అయింది.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణకు జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 8వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. 15 రోజుల్లో విచారణ నివేదికను పంపాలని ఆదేశించింది.
తాజాాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యపై సీబీఐకి కూడ శేజల్ ఫిర్యాదు చేసింది. శేజల్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని చిన్నయ్య గతంలోనే ప్రకటించారు. శేజల్ తాజాగా సీబీఐకి ఫిర్యాదు చేయడంపై దుర్గం చిన్నయ్య ఏ రకంగా స్పందిస్తారో చూడాలి .
also read:బెల్లంపల్లి ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై యువతి ఎన్‌సీడబ్ల్యులో ఫిర్యాదు: విచారణకు ఆదేశం
దుర్గం చిన్నయ్యపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించారు. తాను ఇచ్చిన ఆధారాలను పోలీసులు ధ్వంసం చేశారని బాధితురాలు ఆరోపించారు.