18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేం: తేల్చిచెప్పిన ఈటల

By Siva KodatiFirst Published Apr 29, 2021, 2:17 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్. కేంద్రం సెకండ్ వేవ్ వస్తుందని చెప్పింది కానీ ఇంత త్వరగా వుంటుందని హెచ్చరించలేదని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్. కేంద్రం సెకండ్ వేవ్ వస్తుందని చెప్పింది కానీ ఇంత త్వరగా వుంటుందని హెచ్చరించలేదని ఎద్దేవా చేశారు. వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉండదనే ఎన్నికలు కూడా పెట్టారని రాజేందర్ గుర్తుచేశారు.

ప్రపంచం మొత్తం ఈ పరిస్ధితిని దేశాల వారీగా చూస్తున్నారే కానీ, రాష్ట్రాల వారీగా చూడటం లేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో కేంద్రం సరిగా స్పందించడం లేదని మంత్రి ఆరోపించారు.

అలాగే 18 ఏళ్లు నిండిన  వారికి ఇప్పుడే వ్యాక్సిన్ ఇవ్వలేమని ఈటల తేల్చిచెప్పారు. కేంద్రం కేటాయించిన వ్యాక్సిన్‌ను బట్టే టీకాలు ఇవ్వగలమన్నారు. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టేది లేదని మరోసారి స్పష్టం చేశారు ఈటల రాజేందర్.

Also Read:ఉచిత టీకా: పూర్తిస్థాయి ఆదేశాలివ్వని టీ సర్కార్, రెండ్రోజుల్లో క్లారిటీ

ఆక్సిజన్ సరఫరాను కేంద్రం నియంత్రణ చేయడం కాదు... రాష్ట్రాల అవసరాలు తీర్చాలన్నారు మంత్రి ఈటల. తెలంగాణకు 3.50 కోట్ల డోసులు కావాలన్నారు. వ్యాక్సిన్‌ను కేంద్రమే ఇవ్వాలని.. రెమ్‌డిసివర్ ధర రూ.3000 వుంటే రూ.30 వేలకు అమ్ముతున్నారని చెప్పారు.

ఎక్కువ ధరకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించాలని కోరారు ఈటల. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్  నుంచి రోగులు వస్తున్నప్పటికీ.. వారికి అందరితో సమానంగా చికిత్స అందిస్తున్నామని రాజేందర్ పేర్కొన్నారు. 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!