ఈ సమయంలో ఎన్నికలా? ప్రజల ప్రాణాలకు విలువ లేదా? హైకోర్టు మండిపాటు..

Published : Apr 29, 2021, 01:13 PM IST
ఈ సమయంలో ఎన్నికలా? ప్రజల ప్రాణాలకు విలువ లేదా?  హైకోర్టు మండిపాటు..

సారాంశం

ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మినీ పురపోరు నిర్వహణపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మినీ పురపోరు నిర్వహణపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా అని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుంది. తర్వాత చర్యలు ఏంటని న్యాయస్థానం ప్రశ్నించగా పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమిచ్చింది.

దీనిపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? నియంత్రణ చర్యలపై దాగుడుమూతలు ఎందుకు? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? కట్టడి చర్యలపై మేము ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదు.  క్షేత్రస్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి అని సూచించింది.

దీనిపై స్పందించిన ఏజీ ప్రసాద్ ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నం లోగా సమాధానం చెబుతామన్నారు. మరోవైపు కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని కోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని అడిగింది.

యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా? ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్నారా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో కరోనా తీవ్రత.. త్వరలోనే కేసీఆర్ రివ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం: మహమూద్ అలీ..

కొన్ని మున్సిపాలిటీలకు ఇంకాసమయం ఉంది కదా అని హైకోర్టు అడగ్గా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో కరోనా సెకండ్ మొదలైనా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు మండిపడింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా? ఎన్నికల ప్రచార సమయం కూడా ఎందుకు కుదించలేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

అధికారులు కరోనా కట్టడిని వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండే పరిస్థితి ఉందంటూ  మండిపడింది. ఎస్ఈసీ ఇచ్చిన  వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu