తెలంగాణలో కరోనా విజృంభణ: 8 వేలకు చేరువలో తాజా కేసులు, 58 మంది మృతి

By telugu team  |  First Published Apr 29, 2021, 10:34 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 8 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది మృత్యువాత పడ్డారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్త 7,994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం గడిచిన 24 గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

కోవిడ్ వ్యాధిని బారిన పడినవారిలో గత 24 గంటల్లో 4009 మంది కోలుకున్నారు. కాగా, 58 మంది మృత్యువాత పడ్డారు ప్రస్తుతం తెలంగాణలో 76 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులున్నాయి. 

Latest Videos

undefined

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,28,28,763 శాంపిల్స్ ను పరీక్షించగా 4,27,960 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 3 లక్షల 49 వేల 692 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మొత్తం 2208 మంది మరణించారు. 

ప్రస్తుతం 76 వేల 60 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 81.71 శాతం ఉంది. మరణాల రేటు 0.51 శాతం ఉంది. 

జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1630 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మేడ్చెల్ మల్కాజిరిగి జిల్లాలో 615, రంగారెడ్డి జిల్లాలో 558 కేసులు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లాలో 424, సంగారెడ్డి జిల్లాలో 33, నిజామాబాద్ జిల్లాలో 301, సిద్ధిపేట జిల్లాలో 269, మహబూబ్ నగర్ జిల్లాలో 263 కేసులు రికార్డయ్యాయి.

జగిత్యాల జిల్లాలో 238, ఖమ్మం జిల్లాలో 213, సూర్యాపేట జిల్లాలో 207, వికారాబాద్ జిల్లాలో 207, నాగర్ కర్నూలు జిల్లాలో 206, మంచిర్యాల జిల్లాలో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

click me!