
తెలంగాణ ఆరోగ్య, వైద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు అధికార బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయన నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు మిట్టకంటి ఆర్జీ వినోద్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం గవర్నర్ లేఖ రాశారు.
థానేలో ఘోర ప్రమాదం.. గిర్డర్ లాంచర్ కూలి 15 మంది మృతి, మరో ముగ్గురికి గాయాలు
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదివారం జీఆర్ఎస్ ట్రస్ట్ సమావేశానికి హాజరయ్యారని, అందులో ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేస్తానని ప్రకటించారని, గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి ఆయన నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ నాయకులు ఆ లేఖలో ఆరోపించారు. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
గంగుల కమలాకర్ ఎన్నికల వివాదం కేసు.. బండి సంజయ్ కు క్రాస్ ఎగ్జామినేషన్..
‘‘ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన రాజకీయ నాయకుడిగా మాట్లాడారు. అతడిని సర్వీస్ నుంచి తొలగించే అంశాన్ని పరిగణించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము’’ అని లేఖలో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం శ్రీనివాసరావును బదిలీ చేయలేదని ఆరోపించారు. ఓ వైపు ప్రజలు అంటు వ్యాధులతో బాధపడుతున్నారని, కానీ హెల్త్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ బహిరంగ సభల్లో రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.