మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఐటీ కారిడార్ కు లేడీస్ స్పెషల్ బస్సులు..

By SumaBala Bukka  |  First Published Aug 1, 2023, 9:11 AM IST

ఐటీకారిడార్లో పనిచేసే మహిళల కోసం టీఎస్ఆర్టీసీ లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది. రానున్న రోజుల్లో ఈ బస్సుల సంఖ్యను మరింత పెంచనుంది. 


హైదరాబాద్ : ఐటీ కారిడార్ లోపనిచేసే మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఐటీ సంస్థల్లో వివిధ విభాగాల్లో  పనిచేసే మహిళ ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ  లేడీస్ స్పెషల్ బస్సును  జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు ఆర్టీసీ అధికారులు సోమవారం ప్రారంభించారు.

ప్రయాణికుల రద్దీ కనుగుణంగా దశలవారీగా మరిన్ని బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ ఖాన్ తెలిపారు.  ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఈ బస్సు జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ కు బయలుదేరుతుంది. సాయంత్రం కూడా మరో బస్సు వేవ్ రాక్ నుంచి జేఎన్టీయూకు రానుంది. సాయంత్రం విధులు ముగిసిన తర్వాత ఐదు గంటల సమయంలో వేవ్ రాక్ నుంచి జేఎన్టీయూకు లేడీస్ స్పెషల్ బస్సులు నడుపుతారు.

Latest Videos

గంగుల కమలాకర్ ఎన్నికల వివాదం కేసు.. బండి సంజయ్ కు క్రాస్ ఎగ్జామినేషన్‌..

ఈ రూట్లో ఐటీ కారిడార్ లోని ఐటీ సంస్థల్లో పనిచేసే సాంకేతిక నిపుణులే కాకుండా.. హౌస్ కీపింగ్ వంటి రెగ్యులర్ సర్వీసులో పనిచేసే మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో జేఎన్టీయూ దగ్గర తీవ్ర రద్దీ ఉంటుంది.  

ఈ కారణంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేడీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రయోగాత్మకంగా సోమవారం నాడు ఒక బస్సును ఏర్పాటు చేశారు. దీనికి మహిళా ప్రయాణికుల నుంచి మొదటి రోజే అనూహ్యమైన స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

వారి డిమాండ్ మేరకు మరిన్ని బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో ఐటీ కారిడార్ కు ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని అనేక మార్గాల నుంచి ఐటీ కారిడారికు ఈ బస్సులు నడపనున్నారు. నగరానికి రానున్న మొదటి విడత 20 ఎలక్ట్రిక్ బస్సుల్లో కొన్నింటిని రకరకాల మార్గాల నుంచి ఐటీ కారిడార్ కు  నడపాలని ఆలోచిస్తున్నారు.

click me!