హైద్రాబాద్‌, గుంటూరులలో ఈడీ సోదాలు: ట్రాన్స్ ట్రాయ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు

By narsimha lode  |  First Published Aug 1, 2023, 9:32 AM IST

హైద్రాబాద్ నగరంలోని పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నాలుగు కంపెనీలకు  డైరెక్టర్ గా  ఉన్న మాలినేని సాంబశివరావు నివాసంలో  ఇవాళ సోదాలు  చేస్తున్నారు.


హైదరాబాద్:  ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు  చెందిన  కార్యాలయాలు, ఆ సంస్థకు చెందిన డైరెక్టర్ల నివాసాల్లో  ఈడీ అధికారులు  సోదాలు  చేస్తున్నారు. తెలంగాణలోని హైద్రాబాద్ తో పాటు  గుంటూరులలో కూడ ఈడీ అధికారులు  తనిఖీలు  చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని  15 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్  సంస్థకు  చెందిన మలినేని సాంబశివరావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాలతో పాటు  ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాలు, ఆ సంస్థ డైరెక్టర్ల నివాసాల్లో   ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టల్లో  ఈడీ అధికారులు తనిఖీలు  చేస్తున్నారు. నాలుగు కంపెనీలకు

ట్రాన్స్ ట్రాయ్  కంపెనీ  పలు బ్యాంకుల నుండి రూ. 10,400 కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.ఈ విషయమై బ్యాంకుల నుండి అందిన ఫిర్యాదు మేరకు  సీబీఐ కేసు నమోదు  చేసింది. 

Latest Videos

యూనియన్ బ్యాంక్ నుండి రూ. 300 కోట్ల రుణాలు తీసుకొని ఎగవేసిందని ఆరోపణలున్నాయి. రూ. 260 కోట్లను వేరే కంపెనీలకు  మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు నుండి రుణం తీసుకున్న డబ్బులతో  బంగారు ఆభరణాలు తీసుకున్నట్టుగా  ఆరోపణలున్నాయి. 2013లో ఆడిట్  సమయంలో  ఈ వ్యవహరం బయటకు వచ్చింది.   అప్పటి నుండి  బ్యాంక్ లిస్టులో నిరర్ధక ఆస్తిగా ఈ రుణాలున్నాయి.  2020 సీబీఐ అధికారులు  ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ట్రాన్స్ ట్రాయ్ సంస్థ  డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు.

 పోలవరం ప్రాజెక్టుతో పాటు  రోడ్డు నిర్మాణాల ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెచ్చిన నిధులను ఇతర అవసరాలకు  ఉపయోగించారని ట్రాన్స్ ట్రాయ్  సంస్థపై  దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి.2020 జనవరి లో ట్రాన్స్ ట్రాయ్ సంస్థలో  సీబీఐ అధికారులు సోదాలు  చేశారు. కెనరా బ్యాంక్, బ్యాంక్  ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంక్  నుండి భారీగా రుణాలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి.  2016 జూలై  నుండి 2022 డిసెంబర్  వరకు ట్రాన్స్ ట్రాయ్  సంస్థలో  డైరెక్టర్ గా రాయపాటి సాంబశివరావు కొనసాగారు.

2017 ఏప్రిల్  18 వరకు మలినేని సాంబశివరావు  ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు.  ఈ కంపెనీకి 2022 సెప్టెంబర్ 15న  ఎండీ చెరుకూరి శ్రీధర్  కంపెనీ నుండి బయటకు వచ్చారు. ఈ విషయమై  నమోదైన సీబీఐ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.  ఈ విషయమై  ఈడీ అధికారులు  ఇవాళ  సోదాలు చేస్తున్నారు.

 

 

click me!