డెల్టాప్లస్ ప్రమాదకరమైందనే ఆధారాల్లేవ్: తెలంగాణ హైకోర్టుకు వైద్య శాఖ

Published : Jul 07, 2021, 05:18 PM IST
డెల్టాప్లస్ ప్రమాదకరమైందనే ఆధారాల్లేవ్: తెలంగాణ హైకోర్టుకు వైద్య శాఖ

సారాంశం

డెల్టా ప్లస్ వేరియంట్  ప్రమాదకరమైందనే ఆధారాలు లేవని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో  కరోనా పరిస్థితులపై  హైకోర్టు విచారణ నిర్వహించింది.

హైదరాబాద్: డెల్టా ప్లస్ వేరియంట్  ప్రమాదకరమైందనే ఆధారాలు లేవని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో  కరోనా పరిస్థితులపై  హైకోర్టు విచారణ నిర్వహించింది.డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని డీహెచ్‌ శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సదుపాయం కల్పిస్తున్నామని కోర్టుకు డీహెచ్‌ తెలిపారు.

 రాష్ట్రంలో 1.14 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్టుగా ఆయన చెప్పారు. సరాసరి రోజుకు 1.40 లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు.6,127 ఖైదీలకు ఒకడోసు, 732 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిపినట్లు జైళ్ల శాఖ కోర్టుకు తెలిపింది. మరో 1,244 మంది ఖైదీలకు వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్
Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు