కేసీఆర్ ఫామ్‌హౌజులో తెలంగాణ తల్లి బందీ: రేవంత్ రెడ్డి

Published : Jul 07, 2021, 04:37 PM IST
కేసీఆర్ ఫామ్‌హౌజులో  తెలంగాణ తల్లి బందీ: రేవంత్ రెడ్డి

సారాంశం

కేసీఆర్ ఫామ్ హౌజ్ లో తెలంగాణ తల్లి బందీ అయిందని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లు కష్టపడితే  తెలంగాణలో  రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: కేసీఆర్ ఫామ్ హౌజ్ లో తెలంగాణ తల్లి బందీ అయిందని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లు కష్టపడితే  తెలంగాణలో  రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.  రెండేళ్లు కష్టపడితే  తెలంగాణలో  రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పీసీసీ చీఫ్ గా ప్రమాణం చేసిన రోజునే వర్షం రావడం శుభసూచికమని ఆయన చెప్పారు. ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

also read:పాదరసంలాంటి కార్యకర్తలే మాకు ప్రశాంత్ కిషోర్‌లు: రేవంత్ రెడ్డి

 కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలు, సమిష్టి నాయకత్వంతోనే అధికారాన్ని చేజిక్కుంచుకొంటుందని ఆయన చెప్పారు.  నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసేందుకే  తనకు సోనియాగాంధీ పదవిని ఇచ్చారన్నారు. వ్యక్తిగతంగా తనపై ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉన్నందున నినాదాలు  చేయవద్దని ఆయన కోరారు. తనను అభిమానించే ఎవరైనా కూడ వ్యక్తిగత నినాదాలు మానేయాలన్నారు. వ్యక్తిగత నినాదాలు చేసిన వారిని పార్టీ నుండి బహిష్కరిస్తానని ఆయన హెచ్చరించారు.

4 కోట్ల ప్రజల కోసం సోనియాగాంధీ తెలంగాణను  ఇచ్చిందన్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలోని నలుగురు నేతల చేతుల్లో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.60 ఏళ్ల మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల  సాకారం అయిందంటే  సోనియాగాంధీ కారణమన్నారు.  తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణకు తల్లి అని ఆయన చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణం చేసిన శ్రీకాంతాచారి ఉద్యమానికి ఊపిరి ఊదాడని ఆయన గుర్తు చేశారు.  ఈ రెండేళ్లు నిద్ర పోకుండా  పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడితే రాష్ట్రంతోపాటు దేశంలో కూడ  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఆయన చెప్పారు. 2014లో తెలంగాణలో 1.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ, కేసీఆర్ సర్కార్ నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలో 1.91 లక్షల  ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.కేసీఆర్ వచ్చాక ఎన్ కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు  ఆగలేదన్నారు.

 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం