టీఆర్ఎస్‌లో చేరకుంటే పాత కేసులు బయటకు తీస్తున్నారు: పోలీసులపై ఈటల ఆరోపణలు

By Siva KodatiFirst Published Jul 7, 2021, 4:34 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు ఒక ఉత్తరం రాశారంటూ మండిపడ్డారు. ఈటల రాజేందర్ చరిత్ర గూర్చి టీఆర్ఎస్ నాయకులకు తక్కువగా తెలుసునని చురకలు వేశారు

టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు ఒక ఉత్తరం రాశారంటూ మండిపడ్డారు. ఈటల రాజేందర్ చరిత్ర గూర్చి టీఆర్ఎస్ నాయకులకు తక్కువగా తెలుసునని చురకలు వేశారు. హుజూరాబాద్ ప్రాంత ప్రజలకు రైతులకు తన గురించి మొత్తం తెలుసునని రాజేందర్ పేర్కొన్నారు. రైతు బంధు పథకం లో దున్నని గుట్టలకు రియాల ఎస్టేట్ భూములకు రైతు బంధు ఇవ్వడం న్యాయం కాదని ఆయన హితవు పలికారు.

రెండున్నర సంవత్సరాలుగా రేషన్ కార్డులు, పెన్షన్ లకు తాళం వేశారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ రాసినట్టు సృష్టించారని,  కొన్ని కులాల ఓట్లు అవసరం లేదని సృష్టించారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాలో తాను చెప్పని విషయాలు చెప్పినట్టు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారని రాజేందర్ మండిపడ్డారు. అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలి కానీ ఇష్టానికి లోబడి కాదని ఆయన హితవు పలికారు.

Also Read:మెప్పు కోసం తంటాలు.. త్వరలోనే నాకు పట్టిన గతి: హరీశ్ రావు‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మండలానికో ఎంఎల్ఏ, ఐదుగురు మంత్రులు ఇంఛార్జిలు అంటున్నారని.. వారి నియోజకవర్గాల్లో గత రెండున్నరేళ్లలో ఎక్కడయినా రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. నియోజక వర్గాల్లో ఎంఎల్ఏ లు రాజీనామా చేసినా, చనిపోయినా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆలోచించే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోని ప్రతి మనిషినీ వేల సంఖ్యలో పోలీసులు భయపడుతున్నారని రాజేందర్ ఆరోపించారు. పాత కేసులు ఉంటే టిఅర్ఎస్ పార్టీకి రాకపోతే తిరిగి కేసులు పెడతామని పోలీసులు భయపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం గాడి తప్పిందని.. ఈ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని తిప్పి కొడతామని రాజేందర్ పేర్కొన్నారు. 

click me!