‘అది మూసీనా? డ్రైనేజా?...దయచేసి అలా చేయకండి’ చేతులెత్తి వేడుకున్న హై కోర్ట్ చీఫ్ జస్టిస్...

By AN TeluguFirst Published Nov 22, 2021, 10:19 AM IST
Highlights

పర్యావరణాన్ని రక్షించేందుకు కేవలం ప్రభుత్వం బాధ్యత ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించారని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి గగన్ విహార్ లో  రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీ  నూతన కార్యాలయాన్ని ఆయన చైర్మన్ జస్టిస్ ప్రకాష్ రావు తో కలిసి ప్రారంభించారు. 

హైదరాబాద్ :  హుస్సేన్ సాగర్ వద్ద ఉండలేకపోయాను, మూసీని చూసి మురిక్కాలువ అనుకున్నా అంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ చంద్ర శర్మ మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. 

పర్యావరణాన్ని రక్షించేందుకు కేవలం ప్రభుత్వం బాధ్యత ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించారని హైకోర్టు Chief Justice Satish Chandra Sharma పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి గగన్ విహార్ లో  రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీ  నూతన కార్యాలయాన్ని ఆయన చైర్మన్ జస్టిస్ ప్రకాష్ రావు తో కలిసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  జస్టిస్ సతీష్ చంద్ర  సభను  ఉద్దేశించి మాట్లాడారు.

‘నేను Madhya Pradesh లో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ గురించి ఎంతో గొప్పగా విన్నాను. మొదటిసారి హైదరాబాదు వచ్చినప్పుడు Hussain Sagarని చూడడానికి వెళ్లాను. అయితే అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయా.. అలాగే హైకోర్టు దగ్గర ఉన్న మూసీనదిని చూసి మొదట మురుగునీటి కాలువ అని అనుకున్నాను. కానీ, నా డ్రైవర్ అది ‘నది’ అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయానని’ సతీష్ చంద్ర చెప్పారు.

నేను ఒక రోజు విమానాశ్రయం వెళుతుంటే కొందరు వ్యక్తులు చెత్త  తీసుకొచ్చి రోడ్డు  పక్కనే వేశారు.  తన కుమారుడు కారు ఆపి  ఆ చెత్తను dustbinలో  వేసారని గుర్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీకి ఐదుసార్లు క్లీన్ సిటీ అవార్డు వచ్చిందని,  అక్కడి కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు మరుగుదొడ్ల పక్కనే ఫుట్పాత్పై భోజనం చేశారని చెప్పుకొచ్చారు.  నదులు, సరస్సులు, పరిసరప్రాంతాలను  కలుషితం చేస్తున్న వారిపై ఈ State Pollution Control Appellate Authority తో పాటు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎయిమ్స్‌లో చేరిన కేసీఆర్ సతీమణి శోభ.. రణదీప్ గులేరియా నేతృత్వంలో చికిత్స, ఢిల్లీలోనే కేటీఆర్

 ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఉండి.. కాలుష్య నియంత్రణకు  పాటుపడాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతులు జోడించి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అథారిటీ మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగానే నవంబర్ 16న, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఏజీ బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పృష్టికర్త ,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఏజీ బిఎస్ ప్రసాద్, అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావు, కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను సిజే సతీష్ చంద్ర శర్మ ప్రత్యేకంగా అభినందించారు. 

ఈ సందర్భంగా తాను రైతు కుటుంబం నుండి వచ్చినట్టు గుర్తు చేసారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

click me!