ఎయిమ్స్‌లో చేరిన కేసీఆర్ సతీమణి శోభ.. రణదీప్ గులేరియా నేతృత్వంలో చికిత్స, ఢిల్లీలోనే కేటీఆర్

By Siva KodatiFirst Published Nov 21, 2021, 9:21 PM IST
Highlights

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సతీమణి శోభ (shobha) ఢిల్లీ ఎయిమ్స్‌లో (aiims delhi) చేరారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పోస్ట్ కొవిడ్ ఇబ్బందులు (post covid) , ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సతీమణి శోభ (shobha) ఢిల్లీ ఎయిమ్స్‌లో (aiims delhi) చేరారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పోస్ట్ కొవిడ్ ఇబ్బందులు (post covid) , ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం శుక్రవారం నాడే ఆమె ఢిల్లీకి వెళ్లారు. ఎయిమ్స్ డైరెక్టర్ (aiims director) రణదీప్ గులేరియా (randeep guleria) నేతృత్వంలోని వైద్యుల బృందం శోభకు పలురకాల టెస్టులు నిర్వహించారు. వాటి ఫలితాలను విశ్లేషించిన డాక్టర్లు.. ఇన్ పేషెంట్‌గా ఆస్పత్రిలో చేరాలని శోభకు సూచింరారు. 

అటు శోభ ఢిల్లీలో వైద్య పరీక్షలు చేయించేందుకు కొడుకు కేటీఆర్ (ktr), కూతురు కవిత (kalvakuntla kavitha) కూడా వెంట వెళ్లారు. శనివారమే వీరు తిరిగి రావాల్సి ఉన్నా వైద్యుల సూచన మేరకు తల్లిని ఎయిమ్స్ లో చేర్పించారు. మరోవైపు ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి కుటుంబమంతా ఢిల్లీకి చేరినట్లయింది. 

ALso Read:వరిపై పోరు: ఢిల్లీకి బయలు దేరిన కేసీఆర్, కేంద్రంతో తాడోపేడో

కేసీఆర్‌ కరోనా (coronavirus) బారినపడిన సమయంలో శోభకు కూడా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత సీఎం దంపతులిద్దరూ కోలుకున్నారు. అయితే ఆమెకు ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ నయంకాక పోవడంతో వైద్యుల సలహాతో ఎయిమ్స్‌లో చేర్పించాలని సీఎం కేసీఆర్‌ భావించారు. ఈ నేపథ్యంలోనే తండ్రి ఆదేశాల మేరకు తల్లిని మంత్రి కేటీఆర్‌ దగ్గరుండి ఢిల్లీకి తీసుకువెళ్లారు. 

click me!