బ్రేకింగ్: ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు తెలంగాణ సర్కార్ చేతికి

By Siva Kodati  |  First Published Aug 13, 2020, 9:39 PM IST

కరోనా చికిత్సకు సంబంధించి తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 50 శాతం బెడ్లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలు అంగీకరించాయి


కరోనా చికిత్సకు సంబంధించి తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 50 శాతం బెడ్లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలు అంగీకరించాయి.

ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల్లోని 50 శాతం బెడ్లను పేషెంట్లకు వైద్య ఆరోగ్య శాఖ కేటాయించనుంది. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లను అడ్మిట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Latest Videos

undefined

Also Read:ఆక్సిజన్ లేక కరోనా రోగులు మరణిస్తున్నారు: సీఎస్ తో తెలంగాణ హైకోర్టు

దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపకల్పించేందుకు గాను రేపు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావుతో ఆసుపత్రుల యాజమాన్యాలు భేటీ కానున్నాయి.

హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులు  కరోనా చికిత్స పేరిట భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణల పట్ల సర్కార్ తీవ్రంగా స్పందించింది. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఐసీయూలు సహా అన్ని తరహా బెడ్లలో 50 శాతం మేర స్వాధీనం చేసుకుంటామని రెండు రోజుల క్రితం ప్రభుత్వం హెచ్చరించింది.

దీనిలో భాగంగా ప్రయివేట్ హాస్పిటళ్లలో బెడ్లను స్వాధీనం చేసుకొని.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిబంధనల మేరకు చికిత్స అందించడానికి ప్రణాళికలను రూపొందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,931 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,475కి చేరింది. కోవిడ్ కారణంగా 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 665కి చేరుకుంది. 

click me!