టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని కమీషన్ కోరింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని కమీషన్ కోరింది.
కాగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీకైందా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించారు. గ్రూప్-1 పరీక్షను నిందితుడు ప్రవీణ్ కూడా రాశాడు. కానీ ఈ పరీక్షకు ప్రవీణ్ క్వాలిఫై కాలేదు. అయితే ఈ పరీక్షలో ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయి. టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తూ గ్రూప్ -1 పరీక్ష రాసిన ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చినా ఎందుకు క్వాలిఫై కాలేదని పోలీసులు ఆరా తీశారు. టీఎస్‌పీఎస్‌సీ నిబంధనలకు విరుద్దంగా ఆన్సర్ షీట్ లో ప్రవీణ్ తప్పుగా వ్యవహరించినట్టుగా గుర్తించారు. దీంతో ప్రవీణ్ క్వాలిఫై కాలేదు. 160 మార్కుల పేపర్ లో 103 మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది.
ALso REad: ప్రశ్నాపత్రం లీక్: టీఎస్‌పీఎస్‌సీ వద్ద బీజేవైఎం ఆందోళన, ఉద్రిక్తత
మరోవైపు.. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షల సమయంలో కూడా ఇప్పటి మాదిరిగానే పేపర్ ను ముందుగానే ప్రవీణ్ తెలుసుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై వాస్తవాలను తేల్చేందుకు ప్రవీణ్ ఉపయోగించిన ఫోన్ ను ఎఫ్ఎస్‌ఎల్ కు పంపారు. 2022 అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. 2.60 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షలు రాశారు. వీరిలో సుమారు 26 వేల మంది క్వాలిఫై అయ్యారు.
ఇదిలావుండగా.. ఈ నెల 12, 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన రెండు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకాలపై పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలకు సంబందించిన ప్రశ్నా పత్రాల లీకేజీపై సమాచారం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షల పేపర్లు లీకయ్యాయో లేదో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్ బాగోతం, హానీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చాయి. త