ఈ నెల 18న విచారణకు వస్తా: మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ

By narsimha lode  |  First Published Mar 14, 2023, 1:55 PM IST

   మహిళా కమిషన్ పంపిన లేఖకు  బండి సంజయ్  మంగళవారం నాడు  లేఖ రాశారుఈ నెల  18న విచారణకు హాజరుకానున్నట్టుగా  బండి సంజయ్ ఆ లేఖలో  పేర్కొన్నారు. 
 


హైదరాబాద్: ఈ నెల  18వ తేదీన  విచారణకు  హాజరు కానున్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్   తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు  మంగళవారంనాడు లేఖ రాశారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు  చేసినందున  బండి సంజయ్ కు  తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్  నోటీసులు జారీ చేసింది. ఈ నెల  15వ తేదీన ఉదయం  11 గంటలకు  విచారణకు రావాలని ఆ నోటీసులో  మహిళా కమిషన్  ఆదేశించింది.  ఈ నోటీసులకు  బండి సంజయ్ ఇవాళ  సమాధానం పంపారు.  పార్లమెంట్  సమావేశాలున్నందున  ఈ నెల  15న విచారణకు  రాలేనని  ఆ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై  కవితకు  ఈడీ నోటీసులు జారీ చేసిన అంశంపై  బండి  సంజయ్  వ్యాఖ్యలు  చేశారు.  ఈ వ్యాఖ్యలు  చేసిన  బండి సంజయ్ పై  పోలీసులకు బీఆర్ఎస్  నేతలు ఫిర్యాదు  చేశారు.  

Latest Videos

undefined

ఈ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్  సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది  మహిళా కమిషన్.  విచారణ చేసి  నివేదిక ఇవ్వాలని  డీజీపీ అంజనీ కుమార్ ను  రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. 

 ఈ ఆదేశాల మేరకు డీజీపీ  రాష్ట్ర మహిళా కమిషన్  కు నివేదికను సమర్పించారు.ఈ నివేదిక ఆధారంగా   బండి సంజయ్ కు  నిన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్  నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసులపై  మహిళా కమిషన్ కు  బండి సంజయ్  సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలున్నందున  ఈ నెల  18న విచారణకు హాజరు కానున్నట్టుగా ఆయన తెలిపారు.

also read:బండికి షాక్: విచారణకు రావాలని మహిళా కమిషన్ నోటీసులు

కవితపై  బండి సంజయ్  చేసిన వ్యాఖ్యలను  నిజామాబాద్ ఎంపీ అరవింద్  తప్పు బట్టారు. మరో వైపు  బీజేపీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్ రావు కూడా  తప్పుబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో  ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఈ నెల  11న  కవిత విచారణకు హాజరయ్యారు.ఈ నెల  16నమరోసారి కవిత విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే


 

click me!