తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారంనాడు సమీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విడతల వారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు నిర్ధారించారు . మరో వైపు టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకం పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు చోటు చేసుకున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ ముందు విద్యార్ధి, యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి.
also read:గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకైందా?: ప్రవీణ్‌కు 103 మార్కులు, కానీ...
టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై సీఎస్ సమీక్ష నిర్వహించనున్నారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ శాంతి కుమారి అధికారులకు దిశా నిర్ధాేశం చేయనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం కూడా లీకౌందా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ విషయాన్ని నిర్ధారించాల్సి ఉంది.