బండి సంజయ్ ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించిన తెలంగాణ సర్కార్

Siva Kodati |  
Published : Jul 09, 2022, 09:09 PM IST
 బండి సంజయ్ ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించిన తెలంగాణ సర్కార్

సారాంశం

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోరాటం ఉధృతం చేశారు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం కోరుతూ ఆర్టీఐ కింద పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు సంజయ్ కి సమాచారం అందించారు అధికారులు.   

జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభ తర్వాత తెలంగాణలో బీజేపీలో (bjp) జోష్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజుల క్రితం తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) .. సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దీనికి ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎస్ కార్యాలయ అధికారులకు ఈ దరఖాస్తులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బండి సంజయ్ కి సమాచారం అందించారు. 

గత నెల 28న 88 అంశాలపై బండి సంజయ్ ఆర్టీఐ కింద దరఖాస్తులు దాఖలు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం నుంచి మీడియా ప్రకటనల వరకు వివరాలను బండి సంజయ్ ఆర్టీఐ కింద కోరినట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సచివాలయానికి ఎన్ని రోజులు హాజరయ్యారనే వివరాలను కూడా బండి సంజయ్ కోరారు. 2014 జూన్ 2 నుంచి 2002 జూన్ 2 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సంబంధించిన వివరాలను తెలపాలని కూడా బండి సంజయ్ దరఖాస్తు చేశారు. అలాగే కేసీఆర్.. ఎన్ని రోజులు ప్రగతి భవన్‌లో ఉన్నారు,  ఫామ్ హౌస్‌లో ఎన్ని రోజులు ఉన్నారనే దానిపై సమాచారం ఇప్పించాల్సిందిగా కోరారు. 

ALso Read:వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా.. గజ్వేల్‌లో పనిమొదలు, ఇక్కడా బెంగాల్ సీన్ రిపీట్ : ఈటల సంచలనం

భర్తీ చేసిన ఉద్యోగాలు, గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులు, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు, కేసీఆర్ జీతభత్యాలు, పర్యటనల వివరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ వివరాలు, రైతుల రుణమాఫీ, కార్పొరేషన్‌లకు కేటాయించిన నిధులు, సబ్సీడీ రుణాలు.. ఇలా పలు అంశాలపై వివరాలు అందజేయాల్సిందిగా బండి సంజయ్ ఆర్టీఐ కింద దరఖాస్తులు దాఖలు చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?